మహాబలపరీక్ష రేపే.. !!

Balachander

మహారాష్ట్రలో రాజకీయం కీలక మలుపు తిరిగింది.  ఆదివారం రోజున మహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు.  ఈ కేసును దాఖలు చేసిన ఆరోజు వాదనలు విన్నది.  అదే విధంగా నిన్నటి రోజున కూడా సుప్రీం కోర్టు వాదనలు విన్నది. ఈ వాదనలు విన్న అనంతరం తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది.  కాగా, ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  
ఈ తీర్పు ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్షను నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో మరో 24 గంటల పాటు మహాఉత్కంఠత నెలకొన్నది.  ఈ ఉత్కంఠతను దాటుకొని ఎవరు విజయం సాధిస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది.  దీంతో రేపు ఉదయం నుంచి సభ్యుల ప్రమాణం, ప్రొటెం స్పీకర్ ఎంపిక ఉంటుంది.  ప్రొటెం స్పీకర్ ఎంపిక తరువాత ప్రమాణస్వీకారాలు, ఎంపిక ఉంటుంది.  ఆ తరువాత బలపరీక్షను నిర్వహిస్తారు.  
బీజేపీ తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది అంటుంటే.. శివసేన.. ఎన్సీపీ తమకున్న 162 మంది ఎమ్మెల్యేలను బలప్రదర్శనగా చూపించారు.  అయితే, ఎన్సీపీలో ఉన్న 56 మంది ఎమ్మెల్యేలు అటువైపే ఉన్నారా లేదా అన్నది తెలియాలి.  అదే విధంగా శివసేనలోని ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు ఇస్తున్నారా లేదా అన్నది కూడా చూడాలి.  దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కూడా చీలికలు వచ్చే అవకాశం లేకపోలేదు.  
ఏది ఏమైనా ఇంకా 24గంటల సమయం ఉన్నది కాబట్టి ఈ 24 గంటల్లో ఏదైనా జరగొచ్చు.. ఏది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇరు వర్గాలు తమదే విజయం అంటే తమదే విజయం అని అంటున్నాయి.  అయితే, ప్రొటెం స్పీకర్ ఎంపికపైనే మహా రాజకీయం ఆధారపడి ఉంటుంది.  ప్రొటెం స్పీకర్ పదవిని ఎవరికీ ఇస్తారు అన్నది చూడాలి.  ప్రొటెం స్పీకర్ పదవిని బట్టే రేపు బలప్రదర్శన ఉంటుంది.  అజిత్ పవార్ పై బీజేపీ అంతగా ఎందుకు నమ్మకం పెట్టుకుందో తెలియడం లేదు.  అజిత్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడా చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: