బాల్ థాకరే శివసేనను దుమ్మెత్తి పోసిన సీఎం ఫడ్నవీస్!

Durga Writes

మహారాష్ట్ర రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా సినిమాలో కంటే హైడ్రామాలు మహా రాజికీయంలోనే ఎక్కువ ఉన్నాయి. అసలు ఒక సీన్ అనుకునుంటే మరో యాక్షన్ సీన్ తెరపైకి వస్తుంది. ఏది ఏమైతేనేం మహారాష్ట్ర రాజకీయాలు ఈరోజు మరో మలుపు తిరిగాయి. ప్రాణాస్వీకారం చేసిన మూడురోజులకు సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. 

                  

రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన బాల్ థాకరే శివసేనపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అందరూ బీజేపీకే మద్దతు ఇచ్చారని అయన తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదివికి అజిత్ పవార్ రాజీనామా చెయ్యడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం వారికీ లేదని ఫడ్నవీస్ మీడియాతో తెలిపారు. 

                           

ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అయిన అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా తమకు అండగా ఉంటుందని భావించానని అయన అన్నారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రేపు సాయింత్రం ఫడ్నవీస్ సర్కారు బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. అంతకు ముందే అంటే ఈరోజే ఆయన రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా మారింది. 

                  

అధికారం కోసం శివసేన సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిందని ఫడ్నవీస్ దుమ్మెత్తిపోశారు. పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశాక శివసేన సీఎం పీఠం కోసం బీజేపీని విడిందని అయన మండిపడ్డారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని అందిచలేవని ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఏదిఏమైనా ఈరోజుతో ఒక మహా డ్రామాకు తెరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: