షాకింగ్: వై.ఎస్.ఆర్ లాగానే.. జగన్ ను కూడా ఫినిష్ చేస్తారా..?
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చరిష్మా ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్నముఖ్యమంత్రిగా చెప్పకుంటారు. ముఖ్యంగా ప్రజాసంక్షేమ పథకాలతో ఆయన చరిత్ర సృష్టించారు. అంతే కాదు.. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో వైఎస్ కు ఉన్నంత కమాండ్ వేరే ఏ ముఖ్యమంత్రికీ లేదు.
అలాంటి వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక..కేవలం ఆరు నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఈ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాకపోతే.. అన్నీ ఊహాగానాలే తప్ప.. ఏదీ రుజువైంది కాదు.. ఇప్పుడు వైసీపీ మరో అనుమానం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వైఎస్ ను ఉద్దేశించి చంద్రబాబు.. ఎవరు మటాష్ అవుతారో చూద్దాం.. అని సవాల్ విసిరిన రెండో రోజుల్లోనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. మరోసారి మటాష్ కామెంట్స్ రిపీట్ చేశారు. మనతో పెట్టుకుంటే ఏమవుతుంది తమ్ముళ్లూ అంటూ సేమ్ డైలాగ్ వాడేశారు. మనతో పెట్టుకున్నవాళ్లందరూ మటాష్ అయ్యారు. మనల్ని ఫినిష్ చేయాలనుకుంటే.. వాళ్లే ఫినిష్ అవుతారు అంటూ కార్యకర్తలతో అన్నారు. దీంతో వైసీపీ నాయకులు మరోసారి వైఎస్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ విషయం ప్రస్తావించారు. “ మాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావంటున్నారని, గతంలో చంద్రబాబు అసెంబ్లీలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి ఇవే మాటలు అన్నారు.. ఆ తరువాత రెండు రోజులకే వైయస్‌ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.. చంద్రబాబు వ్యాఖ్యలపై మాకు అనుమానాలు ఉన్నాయి... అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. మరి అంత అనుమానం ఉంటే..చేతిలో ప్రభుత్వం ఉందిగా.. దర్యాప్తు చేయిస్తే సరి.