బాబోరు అన్ని తెలిసి అక్కడికెందుకెళ్లారో...కానీ.?
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనకు బయల్దేరారు. టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలతో అమరావతి పర్యటన చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో టీడీపీ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడ వరకు పూర్తయ్యాయని... పరిశీలించడంతో అమరావతిలోని టీడీపీ నేతలు రైతులతో సమావేశం కానున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది కానీ... బాబు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. అమరావతిలో రైతులకు బాబు చేసినవన్నీ మర్చిపోయినట్టున్నారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చంద్రబాబుకు తెలుస్తు... రైతులు తమ వ్యవసాయ భూములు త్యాగం చేసి అమరావతి నిర్మాణం కోసం పాటుపడితే రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో తొక్కామని చంద్రబాబుకు తెలుసు. తన పాలనలో తేడా కొట్టడం వల్ల చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారని చంద్రబాబుకు తెలుసు. అమరావతి రైతులందరూ తమపార్టీపై తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబుకు తెలుసు. ఒకవేళ తాను అమరావతిలో పర్యటనకు వెళ్తే రైతుల నుంచి నిరసన సెగలు తాకుతాయని చంద్రబాబుకు తెలుసు. అమరావతి పర్యటనకు మళ్లీ ఎందుకు వచ్చావ్ అంటూ రైతులు ప్రశ్నిస్తారని చంద్రబాబుకు తెలుసు.
ఇన్ని తెలిసిన చంద్రబాబు మాత్రం అమరావతి పర్యటనకు బయలుదేరారు. అది కూడా అమరావతి రైతుల ను కలిసేందుకు బయలుదేరారు. మాస్టర్ మైండ్ చంద్రబాబు అమరావతి రైతులను మరోసారి నమ్మించేందుకు కొత్త వ్యూహంతో బయలుదేరినప్పటికీ అమరావతి రైతుల ఆగ్రహజ్వాలలు ముందు చంద్రబాబు వ్యూహాలు నిలవలేక పోయాయి. చంద్రబాబు అమరావతి పర్యటనలో రైతుల నుంచి అడుగడుగునా ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు అమరావతి కి రావద్దు వెళ్ళిపొండి అంటూ అమరావతి రైతులు నినదిస్తున్నారు . కానీ చంద్రబాబు మాత్రం మొండిపట్టు తో అమరావతి పర్యటన చేసి తీరుతా అంటూ ముందుకు సాగుతున్నారు.ఎక్కడా వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన కంప్లీట్ చేసి ఏం సాధిస్తారో.