ఆడాళ్లకు హైడర్ బాద్.. వరుస అత్యాచారాలు.. హత్యలు!

Durga Writes

ఆడాళ్లకు రక్షణ లేదా అంటే అస్సలు లేదు అనే చెప్పాలి.. ఈ కాలంలో సమాజంలో అత్యాచారాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. పసికందు నుండి వృద్ధురాలు వరుకు ఎవరిని బయటకు పంపాలన్న కళ్ళల్లో కన్నీరు వచ్చేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసిన కళ్ళ నిండా కామం పెట్టుకున్న కామాంధులే కనిపిస్తున్నారు..  బయటకు వెళ్లిన ఆడపిల్ల ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయపడక తప్పడం లేదు. 

 

మనుషులు మనుషులలా ప్రవర్తించడం లేదు.. మానవ మృగాలుగా మారారు. ఒకప్పుడు ఆడపిల్లలను రక్షించుకోడానికి ఇంట్లోనే పెట్టేవారు.. బయటకు పంపే వారు కాదు. మరికొన్ని రోజుల్లో మళ్ళి ఆ ఆచారం తెరమీదకు వస్తుంది ఏమో.. ఆలా ఉంది పరిస్థితి. అమ్మ డాక్టర్ దగ్గరకు వెళ్తున్న త్వరగా వస్తాను అని చెప్పింది. కానీ ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురై సజీవదహనం అయ్యింది. 

 

ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే జరిగింది. ఈ హైదరాబాద్ లో రోజుకు ఒక ఘటన అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గంటకు ఒకరైన బలై పోతున్నారు. అసలు ఏమైంది ఈ హైదరాబాద్ కు. రక్షణ లేక ఇలా జరుగుతుందా ? పోలీసులు ఎం చేస్తున్నారు ? వరుస దారుణాలు జరుగుతున్నాయి. ఒక వైపు అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు హత్యలు జరుగుతున్నాయి. 

 

రోజు ఈ హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న సరే అత్యాచారం, హత్య జరిగిన ఒక్కరోజు దర్యాప్తు చేస్తున్నాం, విచారిస్తున్నాం, ఇంట్లోవారినే అనుమానిస్తున్నం అంటూ వెల్లడిస్తారు. కానీ ఆ మర్డర్ వెనుక ఉన్న రహస్యం ఎప్పటికి రహస్యంలనే ఉంటుంది. కొన్ని కొన్ని కేసులలో నిజాలు బయటకు వస్తాయి అది కూడా పేదవాళ్లు నిందితులు అయితే కేసు బయటకు వస్తుంది... అదే ఉన్నవాళ్లు అయితే ఆ కేసులో ఒక్క ఆధారం కూడా బయటకు రాదు. ఇది నేటి చట్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: