హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్... మినిమం చార్జీ ఎంతంటే..?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బస్ చార్జీలు పెరిగాయి. ఆ తరువాత తాజాగా బస్సు చార్జీలను పెంచుతూ మరోసారి ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో మినిమం టికెట్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో మినిమం చార్జీ 5 రూపాయలుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో మినిమం చార్జీ 8 రూపాయలు లేదా 10 రూపాయలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చిల్లర సమస్య లేకుండా బస్ చార్జీలను పెంచితే మాత్రం టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 
 
చిల్లర సమస్య లేకుండా బస్ చార్జీలను పెంచాలంటే 5 రూపాయల టికెట్ ధర 10 రూపాయలు, 10రూపాయల టికెట్ ధర 15 రూపాయలు, 15 రూపాయల టికెట్ ధర 20 రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చార్జీలు పెరగటం వలన బస్ పాస్ ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యార్థులకు అన్ని అర్డినరి బస్సుల్లో మూడు నెలల వరకు 150 రూపాయలు చెల్లించి బస్ పాస్ ద్వారా తిరిగే అవకాశం ఉండేది. 
 
చార్జీలు పెంచక ముందు ఉద్యోగులు ఉపయోగించే బస్ పాస్ లు 790 రూపాయల నుండి మొదలయ్యేవి. అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన బస్ పాస్ ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఆర్టీసీ యూనియన్లకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అధికారులు టీఎంయూ ఆఫీసుకు తాళం వేసి ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు. 
 
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ఆదివారం రోజున భేటీ కానున్నారు. ప్రగతిభవన్ లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ కార్మికులతో సమావేశం కానున్నారు. ప్రతి డిపో నుండి ఐదుగురు కార్మికులకు సీఎం అవకాశం కల్పించారు. ఆర్టీసీ ఎండీకి సీఎం కేసీఆర్ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: