ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలానే చంపండి : చెన్నకేశవులు తల్లి...!
ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రియాంకను ఏ విధంగా చంపారో నా కొడుకును అదే విధంగా చంపినా పరవాలేదని జయమ్మ చెప్పారు. తనకు కూడా ఆడపిల్లలు ఉన్నారని ఏ తల్లికీ ఇలాంటి కష్టం రావొద్దని చెన్నకేశవులు తల్లి స్పష్టం చేశారు. తన కొడుకు చేసిన తప్పు వలన తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని జయమ్మ చెప్పారు.
నా కొడుకు ఇలా చేస్తాడని నేను అనుకోలేదని ప్రేమ వివాహం చేసుకున్నా చెన్నకేశవులును ఏమీ అనలేదని జయమ్మ చెప్పారు. చెన్నకేశవులుకు కిడ్నీ పాడైందని జయమ్మ తెలిపారు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుకుంటున్నారని మహ్మద్ అరీఫ్ తో స్నేహం చేసిన తరువాతే తన కొడుకు చెడిపోయాడని జయమ్మ చెప్పారు. ఇప్పుడు నా కొడుకును ఏమీ చేయొద్దంటే ఎవరూ వినరని జయమ్మ అన్నారు.
నా కొడుకును ఉరి తీయండి లేదా కాల్చి చంపండని జయమ్మ అన్నారు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నా కొడుకును తీసుకొనిపోయారని నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కనలేదు కదా ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే అని జయమ్మ చెప్పారు. మహ్మద్ షాషా తల్లి మోలే బీ మాట్లాడుతూ తన కొడుకు అలాంటివాడు కాదని టీవీలో వార్తలు వచ్చేంత వరకు ఈ విషయం గురించి తెలియదని చెప్పారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు మహ్మద్ అరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నెకేశవులును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు కూడా ఉన్నాడని పోలీసులు ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ 28 నిమిషాల్లో ప్రియాంక రెడ్డిపై లైంగిక దాడి, హత్య జరిగిందని తెలిపారు.