బంగారం కొంటున్నారా బీ అలెర్ట్, బంగారం స్వచ్ఛతపై సంచలనం నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్

Padigala Nagaraju

బంగారం కొనేటప్పుడు ఆభరణాలు స్వచ్ఛత గురించి ఆందోళన చెందుతున్న ప్రజల ప్రయోజనం కోసం ఇది మోడీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. జనవరి 15, 2020 నుంచి బంగారు ఆభరణాలు, కళాఖండాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రకటించారు. 

 

భారతదేశంలో బంగారు ఆభరణాలుపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతోందని, దీని కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ హాల్‌మార్కింగ్ కు అమలు కోసం ఒక సంవత్సరం వ్యవధిని ఇస్తామని మీడియాతో మాట్లాడుతూ పాస్వాన్ అన్నారు. బంగారు ఆభరణాలు మరియు కళాఖండాల డిమాండ్ తలెత్తే ప్రదేశాలలో ప్రైవేట్ వ్యవస్థాపకులు ఈ హాల్‌మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

 

జ్యువెలర్స్ వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక సంవత్సరం సమయం ఇస్తున్నాం మరియు చిల్లర వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న స్టాక్లను క్లియర్ చేయడానికి ఒక సంవత్సరం సమయం సరిపోతుంది. బంగారం స్వచ్ఛతను గుర్తించలేకపోతున్న గ్రామాలు మరియు చిన్న పట్టణాల్లోని పేద ప్రజలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి చెప్పారు.

 

"బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016 లో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు మరియు కళాఖండాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయడానికి సెక్షన్ 14 మరియు సెక్షన్ 16 కింద నిబంధనలు కల్పించింది. బంగారు ఆభరణాలు మరియు కళాఖండాలను విక్రయించే వ్యాపారులు అందరూ బిఐఎస్ లో నమోదు చేసుకోవడం మరియు హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలు మరియు కళాఖండాలను మాత్రమే విక్రయించడం తప్పనిసరి" అని ఒక అధికారి తెలిపారు. 

 

అక్టోబర్ 31, 2019 నాటికి దేశవ్యాప్తంగా 234 జిల్లాల్లో 877 స్థానాల్లో హాల్‌మార్కింగ్ కేంద్రాలు వ్యాపించాయి మరియు ఇప్పటివరకు 26,019 మంది బంగారు ఆభరణాల వ్యాపారులు బిఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: