కష్టపడితే ఏదైనా సాధ్యమే: మంత్రి మల్లారెడ్డి

Suma Kallamadi

ఈ కాలంలో ఏ విధమైన కష్టం లేకుండా ఫలితము లభించాలంటే చాలా కష్టపడితే ఫలితము అదంతట అదే వస్తుంది. కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే నిదర్శం అని మంత్రి మల్లారెడ్డి వివరించడం జరిగింది. మంత్రి చిన్నప్పుడు సైకిల్ మీద తిరుగుతూ పొద్దుపొద్దున్నే పాలు సరఫరా చేపేవాడినని.. తెలిపాడు. అప్పుడు కష్టపడితే ఈ రోజు నేను మంత్రి అయ్యానని ఆయన తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్ ఈరోజు మల్లారెడ్డి విద్యా సంస్థల వరకు వ్యాపించిదంటే అందుకు నిదర్శనం కష్టం యొక్క ఫలితము అని ఆయన సూచించడం జరిగింది. తాజాగా  టీఎస్-ఐపాస్ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి అయినా సందర్భంగా ఏర్పాటు చేసిన  సమావేశంలో మంత్రి  ఈ విషయాలను తెలియచేయడం జరిగింది.

 

 ఐదేళ్లలో TS-ఐపాస్ విజయవంతం అవ్వడంతో  మంత్రి మల్లారెడ్డి ఎంతగానో ఆనందము వ్యక్తం చేయడం జరిగింది. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు కూడా ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ప్రశంసలు భారీగా కురిపించారు. ఈ సందర్భంగా తన యొక్క విజయాల  గురించి ప్రస్తావిస్తూ.. తాను ఎదిగిన పరిస్థితుల గురించి చెప్పుకొని రావడం జరిగింది. గతంలో సైకిల్పై పాల వ్యాపారం కూడా చేశాను నేను అని తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలుగువారికి చాలా తెలివి తేటలు చాల ఎక్కువ అని.. తెలియ చేయడం జరిగింది. యువత ఎంత కసిగా పని చేస్తే అంత తొందరగా లక్ష్యాలను చేరుకో గలరని ఆయన తెలిపారు. మనము అందరం కలిసి పని చేసి తెలంగాణను భారత దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండేటట్లు చూడాలి అన్నారు.. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని.. తెలియజేశారు. ఆయణ్ని యువత అందరూ  ఆదర్శంగా తీసుకోవాలని మల్లారెడ్డి సూచించారు. ప్రజలు కూడా కేటీఆర్ చేసేటటువంటి పథకాలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటాయని, అయినా ఏదైనా విషయములో  ఖచ్చితత్వము ను పాటిస్తారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: