కర్ణాటక ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.?
కర్ణాటకలో ఈ నెల 5న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గతంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆదేశాలతో 15 మంది ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయగా ఆ వెంటనే స్పీకర్ కూడా వారిపై అనర్హత వేటు వేశారు.దీంతో కర్ణాటకలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన జోరు చూపించింది . మొదటినుంచి ఆధిక్యంలో కొనసాగుతు దూసుకుపోయింది బిజెపి.
కాగా అత్యధిక ఓట్లు మెజార్టీతో ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధించింది బిజెపి. దీంతో కర్ణాటకలో బిజెపి శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగా జేడీఎస్ కు ఒక అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కలేదు... కాగా ఒక స్వతంత్ర అభ్యర్థి ఓ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఉప ఎన్నికల్లో బీజేపీకి సరిపడా మెజారిటీ రావడంతో... ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. బీజేపీ పార్టీ 12 స్థానాలు దక్కించుకోవడం పై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆనందోత్సాహంలో మునిగిపోయారు.
అయితే దీనిపై దేశ ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రజా తీర్పు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వెళ్లిన వారికి ప్రజలు శిక్ష వేస్తారు అనడానికి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బిజెపి ఊహించిన దానికంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలవటంతో పాటు బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.