జగన్ గురుంచి రాజశేఖర్ రెడ్డి కి నేను అప్పుడే చెప్పాను : చంద్రబాబు
నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే జరుగుతున్నాయి. నేడు కూడా అసెంబ్లీ సమావేశం మొత్తం హాట్ హాట్ గానే జరిగింది. టిడిపి వైసిపి వాదోపవాదాల మధ్య సభ మొత్తం రసాభాసగా మారింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఘాటుగానే జరిగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సభ్యుల గందరగోళం మధ్య నేడు అసెంబ్లీ సమావేశం ముగిసిపోయింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ పలు అంశాలపై ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పై ప్రశ్నలు సంధించింది... పక్ష పార్టీ ప్రశ్నలకు అధికార పార్టీ ఘాటుగానే బదులిచ్చింది.
అయితే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన క ఆయన కుమారుడు నారా లోకేష్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో లేని వారి గురించి మాట్లాడవద్దు అని స్పీకర్ చెబుతున్నప్పటికీ కూడా అంబటి రాంబాబు అలాగే వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై స్పందించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగానే బదులిచ్చారు. అంబటి రాంబాబు మా అబ్బాయి గురించి మాట్లాడారు... అతనికి తెలియదు.. ఇదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి చర్చకు వస్తే చెప్పా.. మీ అబ్బాయి జగన్ ను అమెరికా పంపిస్తే తిరుగుటపాలాలో వచ్చేసాడు. మా వాడు అమెరికాలో చక్కగా చదువుకుంటున్నాడు.. దీనికి నేను గర్వపడుతున్నా అంటూ... నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి తాను చెప్పాను అంటూ చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో... మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.. మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం.. మనుషులను హేళన చేస్తూ అవమానించడం సరైన పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు దీటుగా బదులిచ్చాడు. వాళ్లు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే నేను కూడా ఒక పద్ధతి ప్రకారమే గౌరవిస్తాను అంటూ తెలిపాడు. అంతేకానీ వీళ్లు నన్ను చులకన చేసి అవమానించేలా మాట్లాడితే... వాళ్లకు కూడా అవమానమే జరుగుతుంది అని తెలిపాడు. ఈ విషయం వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.