ఏపీలో ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్
ఆంధ్ర ప్రదేశ్ ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ను సర్కార్ సస్పెన్షన్ చేసింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు కృష్ణ కిషోర్ పై రావడం జరిగింది. కృష్ణ కిషోర్ తో పాటు అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో కృష్ణ కిషోర్ ఏపీ ఆర్ధిక అభివృద్ది మండలి సీఈవోగా పని చేయడం జరిగింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖలు ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించడం జరిగింది.
ఈ నివేదికల ఆధారంగా కిషోర్ ను సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆయన పై కేసునమోదు చేయాలని సీఐడీ, ఏసీబీ డీజీలను సర్కార్ ఆదేశించడం జరిగింది. ఆర్ధిక అభివృద్ది మండలి సీఈవోగా పని చేసిన సమయంలో జరిగిన అక్రమాల పై విచారించాలని సర్కార్ సూచించింది. ఆరు నెలల్లోపు ఈ విచారణ పూర్తి చేయాలని, అప్పటి వరకు కిషోర్ ను అమరావతి విడిచి పోవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అయితే కిషోర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరించారన్న చర్చ కొనసాగుతుంది. సీఎం జగన్ కావాలనే కక్ష పూరితంగా కిషోర్ పై విచారణ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపణలు మొదలు పెట్టారు. అప్పట్లో ఐటీ కమిషర్ గా ఉన్నప్పుడు జగతి లావాదేవీల పై నివేదిక ఇచ్చి, సంస్థకు షేర్ వాల్యూ లేదని కిషోర్ చెప్పారని వారు గుర్తు చేయడం జరిగింది. రూ.325 కోట్లు ట్యాక్స్ విధించాడని, దాని ఆధారంగానే అప్పట్లో సీబీఐ కేసు నమోదైందని నేతలు తెలియచేయడం జరిగింది. దీనిని మనసులో పెట్టుకుని సీఎం జగన్ ఇప్పుడు కావాలని కిషోర్ ను వేధిస్తున్నాడని వారు అన్నారు. సీఎం జగన్ అవినీతి పాలన అందించడం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు తెలిపారు. కిషోర్ అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో సహా తేలిందన్నారు. త్వరలో విచారణలో మరిన్ని నిజాలు బయటికి వస్తాయని వారు తెలియచేయడం జరిగింది.