చంద్రబాబు మార్షల్స్ ను బాస్టడ్ అని తిట్టారు : సీఎం జగన్

Reddy P Rajasekhar

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించాల్సిన గేట్ అది కాదని అన్నారు. సాధారణంగా చంద్రబాబు గేట్ నంబర్ 2 నుండి ప్రవేశించాలని కానీ చంద్రబాబు కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో గేట్లలో ప్రవేశించే కార్యక్రమం చేయడం వలన మార్షల్స్ కు ఎవరు సభ్యులో ఎవరు సభ్యులు కాదో ఎవరికి అనుమతి ఇవ్వాలో ఎవరికి అనుమతి ఇవ్వకూడదో కూడా అర్థం కాలేదని అన్నారు. 
 
మార్షల్స్ వాళ్ల డ్యూటీని వాళ్లు నిబంధనల మేరకు చేస్తున్నారని అన్నారు. మార్షల్స్ ను చంద్రబాబు బాస్టడ్ అని దుర్భాషలాడాడని చెప్పారు. లోకేశ్ మార్షల్స్ గొంతు పట్టుకుని, నోటికొచ్చినట్లు తిట్టారని జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు. సభ్యులు కాని వారిని మాత్రమే అడ్డగించడానికి మార్షల్స్ ప్రయత్నం చేశారని చెప్పారు. 
 
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు బాధ కలిగించిందని అన్నారు. సభ్యులు కాని వారిని అసెంబ్లీ లోనికి అనుమతించరని తెలుగుదేశం పార్టీ సభ్యులకు తెలియదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం తాపత్రయపడుతున్నారని పేర్ని నాని అన్నారు. మార్షల్స్ పై దుర్భాషలాడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్ని నాని స్పీకర్ ను కోరారు. 
 
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సభ్యులపై ఫైర్ అయ్యారు. మార్షల్స్ ప్రతిపక్ష సభ్యులపై వ్యవహరించిన తీరును ఖండించిన బుచ్చయ్య చౌదరి ప్రజాస్వామ్యంలో ఉన్నామో.... నియంతృత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదని అన్నారు. గతంలో చంద్రబాబుపై జగన్ ఎన్నో మాటలన్నారని చెప్పారు. శాసన సభ్యుడిని నిరోధించే అధికారం మార్షల్స్ కు ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి వయసుకు తగినట్లు మాట్లాడాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: