పసుపు రైతులకు శుభవార్త చెప్పిన నిజాంబాద్ ఎంపీ.?

praveen

నిజామాబాద్ పసుపు రైతుల గోస  మాటల్లో చెప్పలేనిది. నాయకులు మారుతున్న పసుపు రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. అంతకు ముందుగా నిజాంబాద్ ఎంపీ గా  ఎన్నికైన కెసిఆర్ కూతురు కవిత పసుపు రైతులను  అందరినీ సమస్యల నుంచి గట్టెక్కించి హామీలు ఇచ్చినప్పటికీ ... ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. దీంతో ఆగ్రహించిన పసుపు రైతులు... పార్లమెంట్ ఎలక్షన్ల లో పెద్ద ఎత్తున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ కాస్తా కెసిఆర్ కూతురు కవిత ఓటమికి కారణమైంది. అంతేకాకుండా అప్పట్లో పార్లమెంటు ఎన్నికల ముందు రైతులందరూ.. తమకు న్యాయం చేస్తామన్న నాయకుడికి ఓటు వేస్తాం అంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో బిజెపి ఎంపీ అరవింద్ పసుపు రైతులకు అధికారంలోకి వచ్చిన  నెలరోజుల్లోగా న్యాయం చేస్తామని చెప్పారు. అయితే తాజాగా పసుపు రైతులను ఉద్దేశించి నిజాంబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 పసుపు రైతులందరికీ జనవరి నెలలో ఓ శుభవార్త వినిపిస్తామని ఆయన వెల్లడించారు. పసుపు  బోర్డును ఏర్పాటు చేయడం కాదు దానికి మించిన ప్రయోజనాలు పసుపు రైతులందరికీ కలిగేలా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు నిజాంబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. పసుపు పంటకు మద్దతు  ధర చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎమ్ , ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని కేంద్రాన్ని ఆయన కోరినట్లు తెలిపారు. 

 


 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఉత్పత్తయ్యే పసుపులో  భారతదేశం వాటా 80 శాతంగా ఉంది. ఇక మన దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే పసుపులో తెలంగాణ వాటా  13 శాతంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా పసుపు ఉత్పత్తి  నిజాంబాద్ జిల్లాలోనే  . ఎక్కువ మంది రైతులు పసుపు పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం పసుపు రైతులందరికీ క్వింటాలుకు 4,500 నుంచి 6500 రూపాయల వరకు ధరలు  పలుకుతున్నాయి. అయితే ప్రస్తుతం పసుపుకు  వస్తున్న ధరతో పూర్తిగా నష్టాల పాలవుతున్నామని ... మద్దతు ధర  ప్రకటించాలంటూ కొన్నేళ్లుగా పసుపు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పసుపును పండించేందుకు లక్షల లో పెట్టుబడులు పెడుతున్నామని... పెట్టిన పెట్టుబడులు కూడా కు రావడం లేదంటూ వాపోయారు పసుపు రైతులు. పసుపుకు  క్వింటాలుకు పదివేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి జనవరి నెలలో పసుపు రైతులకు శుభవార్త చెబుతామని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడంతో పసుపు రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: