ప‌వ‌న్ ప‌రువు తీసిన‌ రాజు ర‌వితేజ... ఓ రేంజ్‌లో ఆడుకున్న ఫ్యాన్స్‌

Pradhyumna

రాజు రవితేజ....జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి.  పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా.అలాంటి రాజు రవితేజ పార్టీకీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన అనంత‌రం తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో...ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ....జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పార్టీ కోసం చాలా చేయాలనుకున్నానని, ఆయన నిజస్వరూపం ఏంటో తెలియ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి అయిన‌ రాజు రవితేజ పేర్కొన్నారు. కులాలు,  మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయడం జనసేన సిద్ధాంతమ‌ని, అయితే అందుకు భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నారని రవితేజ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో జ‌నసేన‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదని తేలిపోయింద‌న్నారు. 

 

ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్ప‌త్రిలో...మంత్రి ఈటల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 


అయితే, ప‌వ‌న్‌కు అత్యంత ఆప్తుడైన వ్య‌క్తి, ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త‌ల్లో ఒక‌రైన రాజు ఈ త‌ర‌హాలో విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా స్వీక‌రిస్తున్నారు? అస‌లు రాజుర‌వితేజ గురించి పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఏం ఫీలింగ్ ఉంది? ఇంత‌కీ జ‌న‌సేన పార్టీతో సంబంధం లేని వారు ఏమ‌నుకుంటున్నారు? ఈ ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. ఈ మేర‌కు నెట్లో ప‌లువురు వ్య‌క్త‌ప‌రిచిన అభిప్రాయాలివి...

 

ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం" href="/Politics/Read/430418/ka-paul-sensational-comments-on-amit-sha-and-jagan-kcr">అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

 

-- అయ్యా మీరు వెళ్లడం వల్ల ఉండడం వల్ల మా వాడికొచెడి పోయేది ఎం లేదు.ఎంతమంది తొక్కాలి అని చూసిన నిలబడగల సామర్ధ్యం మా పవర్ స్టార్కు ఉంది

- ఇంతకు నువ్ ఎవరు బ్రో... నిన్ను ఈ పార్టీలో చూడడం మొదటిసారి
-- రాజోలులో ఉండేది రాపాక క్యాడర్. జనసేనకు క్యాడర్ లేదు
-- వైసీపీని 90% రెడ్డీలు, టీడీపీని 90% క‌మ్మ కుల‌స్తులు న‌మ్మిన‌ట్లు ప‌వ‌న్‌ని కాపులు న‌మ్మ‌లేదు. కాపులు ప‌వ‌న్‌ని అలుసు చేశారు. వేరేవాళ్లు ఎలా నమ్ముతారు!.అయితే ప‌వ‌న్‌ ఇప్పటికైనా రాజకీయాలలో రాజకీయమే చేయాలి.
-- పార్టీ కార్యకర్తలనే మీ వల్లనే నేను ఒడిపోయాను అన్నాడు ఆయన మానసిక స్థితి ఎ విధంగా ఉందో అర్థం చేసుకోండి.
-- పాపం ఎంత బాధ పడ్డాడో ఈ బ్రదర్
--- మీరు ఇంత తెలివిగల వాళ్ళు ఎలా బోల్తాపడ్డారు ? ఈ లెక్కన పవన్ ఎంత పెద్ద ఫిలాసఫ‌రో ....
--- ఇప్పటికయినా నిజం తెలుసుకున్నారు
-- 2019 ఎలక్షన్స్ లో కూడా ఆంధ్రా, తెలంగాణా ప్రజల మధ్య విభేదాలు తేవటానికి pk ప్రయత్నించారు.
--- నీ లాంటి వాళ వుండటం వలన మా జనసేన ఓడిపోయింది
- -జనసేన అమ్మకానికి పెడతారు 
---- నాదెండ్ల మనోహర్ గారు కూడా జనసేన పార్టీ నుంచి బయటకు వస్తే మంచిది ప్రజలో మీకు మంచి పేరుంది
--- సింహం సింగుల్గా వుంటుంది నీ లాంటి వారు మాట వింటే మా అన్నయ్య పేరు పోతుంది నీలాంటి వాళ్ళు ఎంకెందమందిన్నరో దయచేసి వెళ్ళిపొందిరా బాబు మీకు దణ్ణం ఆ ఆ ఆ!
--అన్న పోతే పోరాదే ఎందుకు ఈ సోళ్ళు...

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: