అమెజాన్ సంచలన నిర్ణయం.. షాక్ లో !?
అమెజాన్ ఏది చేసిన సంచలనమే... ఏది మాములుగా చెయ్యదు. ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ నిర్ణయంతో ఎంతో మంది షాక్ గురి అవ్వాల్సిందే. ఆలా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఈ అమెజాన్. అలాంటి ఈ అమెజాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంచలన నిర్ణయంతో వస్తువులను సరఫరా చేసే కొరియర్ సంస్థలకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది.
ప్రపంచ వ్యాప్తంగా, నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా తమ ఆర్డర్లను తామే సరఫరా చేసుకోవటానికి అమెజాన్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే అమెజాన్ సొంత సరఫరా సంస్థ అయిన 'అమెజాన్ లాజిస్టిక్స్' త్వరలోనే యూపీఎస్, ఫెడెక్స్ లాంటి దిగ్గజాలను అధిగమిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
జెఫ్ బెజోస్ సారథ్యంలో నడుస్తున్న ఈ అమెజాన్ గ్రామీణ ప్రాంతాలకు తమ వస్తువులను సరఫరా చెయ్యటానికి ఇప్పటి వరకు ఇతర కొరియర్ సంస్థల మీద ఆధారపడింది. ప్రస్తుతం అమెరికాలో 2.5 బిలియన్ డెలివరీలను అమెజాన్ సరఫరా చేస్తుండగా, ఫెడెక్స్ మూడు బిలియన్లు, యూపీఎస్ 4.7 బిలియన్లను సరఫరా చేస్తోంది.
అయితే 2022 సంవత్సరం కల్లా అమెజాన్ డెలివరీలు 6.5 బిలియన్లను చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. అమెజాన్ సొంత డెలివరీల సంఖ్య గత సంవత్సరం రెండు రెట్లకు పైగా పెరిగింది. దీంతో ఇప్పుడు 20 శాతం నుంచి 46 శాతానికి ఈ అమెజాన్ సొంత డెలివరీల సంఖ్య చేరుకుంది.
కాగా వినియోగదారులకు వారి వస్తువులను మరింత వేగంగా అందించాలనే లక్ష్యంతోనే వాయు మార్గ రవాణాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్టు జెఫ్ బెజోస్ ఇటీవల ప్రకటించారు. మరి పూర్తిగా సొంత డెలివరీని ఎప్పుడు ప్రారంబిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఈ అమెజాన్ ఎద్ధి చేసిన సంచలనం అవుతుంది.