జగన్-చంద్రబాబు మధ్య తేడా ఏమిటో తెలుసా

Vijaya
ప్రజల్లో నుండి పుట్టిన నాయకుడికి వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన నేతకు మధ్య వ్యక్తిత్వంలో  చాలా తేడా ఉంటుంది.  పార్టీ అధినేతను ఎదిరించి పార్టీలో నుండి బయటకు వచ్చిన జగన్ పదేళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి పదివిని అందుకున్నారు. సిఎంగా ఉన్న ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబునాయుడు సునాయాసంగా సిఎం అయిపోయారు. ఇక్కడే ఇద్దరి వ్యక్తిత్వంలోను జనాలు తేడాను స్పష్టంగా పరిగట్టారు.

ఎంత కష్టకాలం ఎదురైనా జగన్ మాత్రం జనాలనే నమ్ముకున్నారు. అందుకనే ఓదార్పు యాత్రలని, పాదయాత్రలని జనాల మద్యలోనే తిరిగారు. 2009లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి అరెస్టయిన విషయం అందరికీ తెలిసిందే. జైలు నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి జగన్ దాదాపు పదేళ్ళు జనాల మధ్యలోనే గడిపారు. 175 నియోజకవర్గాల్లో గట్టి నేతలను తయారు చేసుకున్నారు. అధికారపార్టీపై అలుపెరుగని పోరాటాలు చేసి చివరకు ప్రజాక్షేత్రంలో గెలిచి  ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు.

ఇక చంద్రబాబు విషయం చూస్తే జనాల్లో నుండి వచ్చిన నేతకాదు. ఏదో ఓ ఎంఎల్ఏగా మాత్రమే అదికూడా పార్టీ గాలిఉంటే గెలిచినవాడు అంతే. కాకపోతే ఎన్టీయార్ అల్లుడవ్వటమే చేసుకున్న అదృష్టం. అందుకనే వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని లాక్కోగలిగాడు. మామగారికి వెన్నుపోటు  పొడిచి అధికారంలోకి వచ్చాడు కాబట్టి అడ్డదారులనే నమ్ముకున్నాడు.

ఇందులో భాగమే ఎల్లోమీడియాను మ్యానేజ్ చేయటం. చంద్రబాబు బలమంతా మీడియాను మ్యానేజ్ చేయటం, న్యాయవ్యవస్ధలో ఉన్న పరిచయాలు తప్ప మరోటి కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  నేరుగా జనాలనే నమ్ముకోవటంలో ఎన్టీయార్, జగన్ ది ఒకటే దారి.

ఎల్లోమీడియాను మాత్రమే నమ్ముకుంటే ఉపయోగం లేదని మొన్నటి ఎన్నికల ఫలితాలతో  తెలిసిపోయినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదనే అనుకోవాలి. ఇపుడు జగన్ ను నేరుగా ఎదుర్కోలేకే ఎల్లోమీడియాను రంగంలోకి దింపారు మళ్ళీ. ఎల్లోమీడియా ద్వారానే జగన్ పై బురదచల్లించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తో జగన్ జనాలను నమ్ముకుంటే  చంద్రబాబు మాత్రం ఇంకా ఎల్లోమీడియానే నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: