కర్నూలులో దారుణ హత్య ..ఉలిక్కిపడ్డ జనం
కర్నూలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలు అయంది. గత కొన్ని రోజులుగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య బాగా కలకలం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో బనగానిపల్లె నియోజకవర్గంలోని కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లెలో టీడీపీ నేత మంజుల సుబ్బారావు హత్యకు గురి అవ్వడం జరిగింది. సుబ్బారావు తన స్కార్పియో వాహనంలో ప్రయాణం చేస్తుండగా.. మార్గ మధ్యలో బెలుం గుహల వద్ద దుండుగులు హత్య చేయడం జరిగింది. దుండుగులు స్కార్పియోను అడ్డగించి.. లోపల ఉన్న సుబ్బారావును బయటకు లాగి మరి వేట కొడవళ్లతో నరికి.. రాళ్లతో దారుణంగా దాడి చేయడం జరిగింది.
సుబ్బారావు దుండగుల దాడిలో అక్కడికక్కడే మృతి చండడం జరిగింది.. దీనితో దుండగులు అక్కడి నుంచి పారి పోవడం జరిగింది. ఇక స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలన చేయడం జరిగింది. ఇక పోలీసులు హత్యకేసు నమోదు చేసి.. సుబ్బారావు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించడం జరిగింది. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపై వేట కొడవళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ హత్య చింతలాయపల్లె గ్రామంలోని ప్రత్యర్థుల చేసిన హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా స్థానికుల్ని అన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని ఆరా తీయడం జరిగింది.
ఇక హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇక గతంలో ఎన్నికల సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు అని తెలిపారు . ఇక ఈ ఘటనపై బీసీ జనార్ధన్‌రెడ్డి స్పందించడం జరిగింది. ఘటనపై జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... ఇలా కార్యకర్తల్ని చంపడం పిరికిపందల పని అని...మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ.. ఇలా చంపడం
చాల దారుణం అని మండిపడ్డారు.