అబ్దుల్లాపూర్మెట్ లో దారుణం... అందుకు ఒప్పుకోలేదని మహిళపై కత్తితో దాడి.?

praveen

సమాజంలో రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తమకు అడ్డు వచ్చిన భర్త భార్యను చంపేందుకు కూడా వెనకాడడం లేదు. మూడో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్త,  భార్యలను అడ్డు తొలగించేందుకు మూడో వ్యక్తి తో కలిసి పథకం పన్ని  మరి అతి దారుణంగా హత్యలు  చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తనతో అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించిందని మహిళపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఇక బాధితురాలు అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆ మహిళ. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో మనసురాబాద్ డివిజన్ లో ఒంటరిగా నివసిస్తోంది. ఇక అదే మండలానికి చెందిన నారాంబాబు గౌడ్ అనే వ్యక్తి... గతంలో ఈ మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. ఇక పరిచయం నెపంతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాలనే ఒత్తిడి తీసుకొస్తున్నాడు . అయితే అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు మహిళ మాత్రం నిరాకరించింది. దీంతో ఆ మహిళ కు రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ వ్యక్తి వేధింపులు తాళలేక మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు నిందితుడు జైలుకు పంపించారు. ఇక ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు నారాంబాబు పెద్దమనుషుల సమక్షంలో ఆ మహిళ పెంట పడను  అంటూ తెలిపాడు. అయినప్పటికీ అతని తీరులో  మాత్రం మారలేదు. 

 

 

 

 ఈనెల 18న మరోసారి బాధిత మహిళ ఇంటికి వెళ్లి అక్రమ సంబంధం గురించి వేధింపులు మొదలుపెట్టాడు. వివాహేతర సంబంధానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయారు నిందితుడు. దీంతో తన వెంట తెచ్చుకున్న కలిగిస్తే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేస్తున్నడని తెలిసి  షాక్కి గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో  అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక బాధితురాలని ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరోసారి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధిత మహిళ తనకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని అడగడానికి వెళ్తే దుర్భాషలాడినది  అని అందుకే కత్తితో దాడి చేశానంటూ  నిందితుడు నారంబాబు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: