లోకేష్‌... గల్లా మధ్య ఏం జరుగుతోంది...?

VUYYURU SUBHASH

తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది బహిరంగంగా చెప్పే విషయం... లోకేష్ పార్టీలో ఉండగా ఆ పార్టీకి భవిష్యత్తు కష్టం... చాలా మంది బహిరంగంగానే సోషల్ మీడియాలో, బయటా లోకేష్ మీద ఉన్న అసహనాన్ని చెప్పేశారు. ఇక ఆయన కారణంగా చాలా మంది నేతలు పార్టీకి దూరంగా కూడా జరిగారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. యువనేతలు, సీనియర్ నేతలు అనే తేడా లేకుండా లోకేష్ దెబ్బకు కంగారు పడ్డారని... వాళ్ళు అందరూ కూడా పార్టీ మారేందుకు కూడా ఒకానొక సందర్భంలో సిద్దమయ్యారని... అయితే చంద్రబాబు చొరవతో పార్టీ మారకుండా ఆగిపోయారని కూడా తెలిసింది.

 

తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఎంపీగా తాను ఎంత సమర్దుడినో నిరూపించుకున్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా జయదేవ్... లోకేష్ దెబ్బకు చికాకు పడుతున్నారట. గల్లా నియోజకవర్గం పరిధిలోనే... మంగళగిరి నియోజకవర్గం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో గల్లాకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. దీనితో గల్లాకు దూరంగా స్థానిక నాయకులను దూరం చేసే ఆలోచనలో లోకేష్ ఉన్నారట. మొన్న ఎన్నిక‌ల్లో ఇక్క‌డ లోకేష్ ఓడిపోయినా.. గుంటూరు ఎంపీగా మాత్రం జ‌య‌దేవ్ గెలిచారంటేనే ఇక్క‌డ జ‌య‌దేవ్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది.

 

ఇంత వ్య‌తిరేక‌త‌లోనూ జ‌య‌దేవ్ గెల‌వ‌డం ఆయ‌న‌కు ఉన్న ఓన్ ఇమేజ్ తెలియ‌జేస్తోంది. గ‌ల్లాకు... రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు, లేదా కీలక పదవి అప్పగించే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో నియోజకవర్గంలో ఆయన్ను బలహీనపరిచే ప్రయత్నం లోకేష్ ఎక్కువగా చేస్తున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం గల్లాను వైసీపీ అభిమానుల రూపంలో టార్గెట్ చేసిందని అంటున్నారు. ఈ విషయం గల్లాకు అర్ధమైందట. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా గల్లా తీసుకువెళ్ళారట. ఆయన బలపడాలి అనుకోవడంలో తప్పు లేదు గాని తనను ఎందుకు బద్నాం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారట గల్లా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: