రాజధానిపై ఆంధ్రా మంత్రి సంచలన వ్యాఖ్యలు...

Suma Kallamadi

తాజాగా ఆంధ్రాలో రాజధానిలు పై పెద్ద చర్చ కొనసాగుతుంది అనే చెప్పాలి. ఇంకా మరో వైపు రైతులు ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా   ఆంధ్రా  రాజధానిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజధానికి నిర్మాణం కోసం తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇస్తున్నాము అని.. రాజధాని భూములు అన్ని కూడా వెనక్కి ఇస్తామని ఎన్నికలకు నిర్వహించకముందే ముందే జగన్ ప్రకటించారని ఈ సందర్బంగా గుర్తు చేయడం జరిగింది. 

 

ఇక అమరావతిలో నిర్మాణాలు తాత్కాలిక నిర్మాణాలు అని అప్పటిలో  చంద్రబాబు తెలిపారు అని.. అలాగే మేము కూడా అమరావతిని తాత్కాలిక రాజధానిగానే భావించడం జరిగింది అని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం మీడియాతో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రాజధానిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారడం జరిగింది.

 


ఇక మూడు రాజధానులు కాకపోతే ముప్పై రాజధానులు మేము చేస్తాము అని మంత్రి తెలిపారు. ఇక రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం ఉండదు అని.. కేంద్రం నుంచి నిధులు మనకు అవసరం లేదు అని అన్నారు. రాజధాని కోసం కేంద్రం నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదు అని తెలిపారు. ఇది రాష్ట్ర పరిధిలోని విషయం అని స్పష్టంగా తెలిపారు. ఇక లెజిస్లేటివ్ కేపిటల్‌ నిర్మాణాకి  300 ఎకరాలు భూమి  సరిపోతుందని.. వేల ఎకరాలు అవసరం లేదు అని తెలియచేయడం జరిగింది. హైదరాబాద్‌లో సెక్రటేరియట్, అసెంబ్లీ ఎన్ని ఎకరాల్లో ఉందని ప్రశ్నించడం జరిగింది. రాజధానికి వేల ఎకరాల భూమి అవసరం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 


ఇక మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా  రాజధానిని తరలించొద్దని అమరావతిలో ధర్నాలు చేసే వారంతా టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని ఆరోపణలు చేయడం జరిగింది. భూములు లాక్కొన్నవారే ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు.ఇక  విశాఖ పట్నంలో  వైసీపీ నేతల భూములు అసలు కొనలేదు అని అన్నారు. ఆ విషయం అంతా అవాస్తవం అని తెలియచేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ భూముల ధరలు చాల ఎక్కువగా ఉన్నాయి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: