కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన   బీహార్ ముఖ్యమంత్రి నితీష్

Suma Kallamadi

తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన  పౌరసత్వం సవరణ చట్టం, ఎన్‌ఆర్సీపై నిరసనలు రోజురోజుకూ బాగా ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని తమ రాష్ట్రాలలో అమలు చేయడం కుదరదు అంటూ పౌరులు రాష్ట్ర ప్రభుత్వాలపై డిమాండ్‌ చేయడం మొదలు పెట్టారు. ఇక నిరసనలు, ఆందోళనలు జరుపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది.

 

 ఈ తరుణంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్‌ ఇవ్వడం జరిగింది. ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసేది లేదు అని  తెలియచేయడం జరిగింది. నిజానికి బిహార్‌లో ఎన్‌ఆర్సీని అమలు చేయ వలసిన అవసరం ఏమి వుంది అని  నితీష్‌ కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనితో నితీష్‌ చేసిన  వ్యాఖ్యలతో కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా మండి పడుతున్న విషయం అందరికి  తెలిసిందే కదా. ఇలాంటి  వివాదాస్పద చట్టాలను మా రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే  లేదు అని  తెలియా చేస్తున్నారు. తాజాగా వారి సరసన నితీష్‌ కూడా చేరడం జరిగింది.

 

 ఇక సీఏఏకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో కూడా  నితీష్‌ నేతృత్వంలోని జేడీయూ మద్దతు పలికిన  విషయం అందరికి తెలిసిందే కూడా. కానీ నితీష్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత వారం రోజుల నుంచి ఆందోళనలతో రాష్ట్రం రావణకాష్టంగా మారడం జరిగింది. ఇక మరో వైపు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, వామపక్షాల నిరసనలతో రాష్ట్రం బగ్గు మంటుంది. తాజాగా పట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో నితీష్‌ ప్రకటన చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలోని ముస్లింలు ఎవరూ కూడా భయపడవద్దు అని సీఎం భరోసా ఇవ్వడం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: