మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలతో అమరావతి రైతుల నిరసన.?

praveen

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి అటు అమరావతి రైతులు కూడా జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై భగ్గుమంటున్నారు. మూడు పంటలు పండించే భూమిని తాము రాజధాని నిర్మాణం కోసం భవిష్యత్తు తరాల కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని వేరేచోటకు మారుస్తాం అంటే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలకు దిగారు అమరావతి రైతులు. దీంతో  రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది అమరావతి రైతుల నిరసన. 

 అమరావతిలో మందడం రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా జిఎన్  రావు కమిటీ ప్రభుత్వానికి అందించిన నివేదిక పై కూడా అమరావతి రైతులందరూ భగ్గుమన్నారు. తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు అమరావతి రైతులు. రోడ్లపై టైర్లు వేసింది నిప్పంటించే  ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నాయి . మరోవైపు మందడం  మెయిన్ సెంటర్లో రోడ్డుకు అడ్డంగా ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహ బుద్ధుడు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. అలాగే రైతుల రిలే నిరాహార దీక్షకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి ఆందోళన తీవ్రతరం చేశారు అమరావతి రైతులు. 

 ఇక మరోవైపు రాయపూడి లోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై అమరావతి రైతులందరూ అర్ధనగ్నంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో  భాగంగా రోడ్డుపైనే వంటావార్పు చేపట్టిన రైతులు.. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మంగళగిరిలోని కొరగళ్లు  లోనూ నిరసనలు భారీ ఎత్తున వెల్లువెత్తాయి. స్థానికులు అందరూ తమ పిల్లాపాపలతో కలిసి రోడ్డుపైకి చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అంతే కాకుండా నీరుకొండ కొండవీటి వాగు వద్ద కూడా రైతులు ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల నిరసనతో రాష్ట్రంలో పలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: