నాగబాబు దారెటు?

Suma Kallamadi

ఏపీలో రాజకీయ వేడి ఎపుడైతే మొదలైందో అప్పటి నుంచి జబర్థస్త్ కామెడీ షో రాజకీయాలకు వేదికగా మారింది. ఈ షోలో జడ్జీలుగా వ్యవరిస్తోన్న నాగబాబు, రోజాలు కూడా పొలిటికల్‌గా వైరీ పక్షంగా ఉన్న జనసేన, వైయస్ఆర్‌సీపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసారు. వైసీపీ తరుపున రోజా..నగరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యే‌గా  పోటీ చేసారు. మరోవైపు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు.. ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు..టీడీపీ నుంచి శివ‌రామ‌రాజు.. నాగ‌బాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో నాగబాబు ఓటమిపాలయ్యారు. 


ఇప్పుడు నాగబాబు పరిస్థితి ఘోరంగా తయారైంది. అటు తప్పుడు వైపు వెళ్లాలా లేక అన్న చిరంజీవి వైపు ఉండాలా అనేది ఆయనకు తలనొప్పిగా మారింది. చాలా రోజులుగా సినిమాలు తప్ప మరో ధ్యాసే లేని చిరంజీవి.. ఉన్నట్లుండి మూడు రాజధానుల విషయంలో మాట్లాడాడు. మాట్లాడిన వాడు ఊరికే ఉండకుండా జగన్‌కు ఫుల్ సపోర్ట్ చేశాడు. ఆయన లేకుంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదనే రేంజ్‌లో పొగిడేశాడు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం జగన్ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. ఈయన మూడు రాజధానుల విషయంలో చాలా సీరియస్ అయ్యాడు. నాలుగు భవనాలు.. నాలుగు రోడ్లు వేసినంత మాత్రాన రాజధాని కాదు జగన్ గారూ అంటూ విమర్శించాడు పవర్ స్టార్. ఇలాంటి సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్‌కు సపోర్ట్ చేయడంతో పవన్ ఒక్కడే కాదు.. ఆయన వెంట ఉన్న నాగబాబుకు కూడా కరెంట్ షాక్ కొట్టింది.


జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ పేరిట ప్రారంభమైన ప్రోగ్రాంలో తొలుత నాగబాబు, యాంకర్ అనసూయలే లీడ్ పర్సన్స్ షో ప్రారంభం అయ్యింది. అయితే ఈ షో కాన్సెప్ట్ ప్రకారం తొలుతు నాగబాబు, అనసూయలను జడ్జిలుగా అనుకున్నారు. అయితే షో ప్రారంభం అయిన తర్వాత మాత్రం నాగబాబును కేవలం పార్ట్ టైమ్ యాంకర్ గా మార్చేసారనే టాక్ వినిపిస్తోంది. అటు అనసూయ మాత్రం ఎంచక్కా తన జడ్జి సీటులో కూర్చొని షో నడిపించేస్తోంది. దీంతో నాగబాబుకు పెద్ద షాక్ తగిలిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలుత నాగబాబు తనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి పెద్ద తలకాయలను లాగి, మల్లెమాలకు షాక్ ఇవ్వాలని చూశాడు. అయితే నాగబాబుతో పాటు మరో జడ్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా మాత్రం జబర్దస్త్ తోనే తన ప్రయాణమని ప్రకటించింది. 


ఇప్పుడు నాగబాబు పరిస్థితి అర్థంకాని రీతిలో తయారైంది. టీవీ ఛానెల్స్ లో కూడా తీవ్ర పరిణామాలు ఎదురవడంతో అటు రాజకీయాల్లోనో తలనొప్పి సంఘటనలు జరగడంతో ఎటూ ఆలోచించుకోలేని స్థితిలో నాగబాబు ఉన్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇస్తారనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: