మేనల్లుడితో అత్త రాసలీలలు.. అది చూసి మొగుడు ఏం చేశాడంటే..?

Chakravarthi Kalyan

మానవ సంబంధాలు చాలా  సున్నితమైనవి.. అందులోనూ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటే.. ఆ కాపురం నరకమే అవుతుంది. వీరిద్దరి మధ్య అస్సలు రాకూడనిది అనుమానం. అది ఒకసారి వచ్చిందంటే.. ఆ కాపురం ఇక నరకమే. అపోహలకు తోడు జీవిత భాగస్వామి పక్కదారులు తొక్కితే ఆ బంధం నిలవడం కష్టం.

 

ఈ విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అసలేం జరిగిందంటే.. ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణి కి కొన్నా్ళ్ల క్రితం పెళ్లయింది. అయితే శివాజీ మానసిక వికలాంగుడు కావడంతో ఇంటి వద్దనే ఉండేవాడు. నాగమణి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించేది.

 

భర్త మానసిక వికలాంగుడు కావడంతో భార్య నాగమణికి అసంతృప్తి ఉండేది. అది కాస్తా పక్కదారి పట్టింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మానసిక వికలాంగుడు కావడంతో అతడిని పెద్దగా లెక్కచేయకుండా.. మేనల్లుడితో రాసలీలలు కొనసాగించింది. ఈ విషయం తెలిసిన భర్త శివాజీ మొదట మందలించాడు.  

 

భర్త మందలించినా నాగమణి మేనల్లుడితో తిరుగుళ్లు మానలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మూడురోజుల నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె ఓ పిల్ల కాలువతో శవమై తేలింది. అక్రమ సంబంధం అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

నాగమణికి కంటి సమస్య ఉంది. దీని కోసం ఆమె వైద్యం కోసం తన సోదరుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వాత ఇక కనిపించలేదు. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక పిల్ల కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే నాగమణిపై మిస్సింగ్ కేసు ఉండటం వల్ల పోలీసులు ఆమె నాగమణి కావచ్చని అనుమానించారు. వారి అనుమానం నిజమైంది.

 

అయితే అక్రమ సంబంధం విషయం తెలిసి భర్త చంపాడా.. లేక.. ఇటీవల తనతో దూరంగా ఉందన్న కోపంతో ప్రియుడు సంతోష్ చంపాడా అన్న విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సంతోష్ పరారీలో ఉండటం అనుమానాలకు బలమిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: