ఆందోళనకారుల విషయంలో సంచలన వాస్తవాలు ?

Vijaya
జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదన  తర్వాత దాదాపు వారం రోజుల నుండి అమరావతి ప్రాంతంలో  కొందరు నానా రచ్చ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే  రాజధానిని తరలించేస్తారనే విషయం స్పష్టంగా తెలిసిపోతున్నా  అమరావతి ప్రాంతంలోని కేవలం కొన్ని గ్రామాల్లోని జనాలు అందులోను కేవలం ఓ సెక్షన్ జనాలు మాత్రమే ఆందోళనల ముసుగులో  రెచ్చిపోతున్నారు.

రాజధాని తరలింపు లాంటి  కీలక నిర్ణయానికి గుంటూరు జిల్లాలోని జనాల నుండే ఆందోళనలు చేస్తున్న వాళ్ళకు  ఎందుకు సరైన మద్దతు దొరకటం లేదు ? ఎందుకంటే ఆందోళనలు చేస్తున్న వాళ్ళల్లో రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉందట. మరి అంతమంది రైతులు, స్ధానికులు  కనిపిస్తున్నారెందుకు ? ఎందుకంటే వాళ్ళంతా ఒరిజినల్ రైతుల నుండి భూములు కొనుక్కున్న  రియల్ ఎస్టేట్ బ్రోకర్లు,  టిడిపి నేతల బినామీలట.

అమరావతిలో రాజధాని నిర్ణయం అయ్యిందన్న విషయం ప్రకటించటానికి ముందే చంద్రబాబునాయుడు, టిడిపి నేతల బినామీలతో పాటు కమ్మ సామాజికవర్గంలోని కీలక నేతలు, వ్యక్తులు రైతుల నుండి పెద్ద ఎత్తున భూములు కొనేశారట. పనిలో పనిగా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా కొందరు నేతలు కొనేశారు. ఎలాగు తమదే ప్రభుత్వం కాబట్టి  ఏదోలా మ్యానేజ్ చేసుకుని అసైన్డ్ భూములను తమ పేర్ల మీద మార్చేసుకోవచ్చన్న ధైర్యంతోనే కొనేశారు.

అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రెండు  నిర్ణయాలతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. మొదటిది అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం. రెండోది రాజధానిని విశాఖపట్నంకు మార్చేయటం. ఈ రెండు నిర్ణయాలతో  మొత్తం బినామీలపైనే దెబ్బ పడింది. అసైన్డ్ భూములమ్ముకున్న రైతులు, మామూలు  రైతుల్లో మాత్రం జగన్ నిర్ణయంపై ఎటువంటి ఆందోళన కనబడటం లేదట. కారణం తమ భూములను తమకు వాపసు ఇచ్చేస్తే మళ్ళీ వ్యవసాయం చేసుకోవటానికి రెడీగా ఉన్నారట.

బినామీలు, టిడిపి నేతలే ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే అసైన్డ్ భూములకిచ్చిన డబ్బూ పోయి ఇపుడు భూములు పోతే మంటకాక ఇంకేముంటుంది ? అందుకనే తమ మద్దతుదారులతో వరుసగా ఆందోళనలు చేయిస్తున్నారు. ఆ ఆందోళనలకే చంద్రబాబు,  ఎల్లోమీడియా కూడా వత్తాసు పలుకుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు గనుకే  ఒరిజినల్ రైతులు, స్ధానికులు పెద్దగా పట్టించుకోవటం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: