విజయసాయిరెడ్డి మాటలకు...ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

praveen

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటుంది జగన్ ప్రకటించిన మూడు రాజధానిల గురించి. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని  అభివృద్ధి ఒకే చోట ఆగి పోకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా  పెను దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల  అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే మూడు రాజధానిల అంశంపై రాజకీయ ప్రముఖుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీ మాత్రం జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. 

 


 జగన్ ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయం వల్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప అభివృద్ధి మాత్రం జరగదు అని జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి .అటు  అమరావతిలో పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారుతోంది. అమరావతి రైతుల నిరసనలు ధర్నాలు రాస్తారోకోలతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రాజధాని రైతులు. అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పటికీ మూడు రాజధానిల పై నిర్ణయం మాత్రం వాయిదా పడింది.ఇకపోతే  క్యాబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని... పలు విషయాలను వెల్లడించారు. 

 

 

 విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ జగన్ తొలిసారి ఇక్కడకి రానున్నారు  అంటూ వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నానిని  మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి పేర్ని నాని.. రాజధాని పై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని  మంత్రి పేర్ని నాని వెల్లడించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు మంత్రి వెల్లడించారు . విశాఖ వైసీపీ ఇన్ చార్జ్ గా ఆయన మాట్లాడి ఉండొచ్చు అంటూ మంత్రి లేదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: