జగన్ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నాడన్న బాబు.. ఏదైనా కుట్ర చేస్తున్నావా ఏంది సామీ అంటున్న తెలుగు ప్రజ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన తొందరపాటు చర్యలతో ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడని అన్నారు. రాజధాని మార్పు అంశంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు జగన్ తీరుపై మండిపడ్డారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.
గతంలోకి ఒక్కసారి చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో టీడీపీ ఫినిష అవుతుంది అంటే చంద్రబాబు దానికి బదులిస్తూ.. చూద్దాం ఎవరు ఫినిష్ అవుతారో అన్నారు. అలా అన్న రెండు రోజులకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీన్ని ఇప్పటికీ వైసీపీ నాయకులు గుర్తు చేస్తుంటారు. అలాగే ఇప్పుడు మరోసారి చంద్రబాబు అన్న మాటలు కలకలం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూసి.. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ వైఖరిపై మండిపడిన చంద్రబాబు…. ముఖ్యమంత్రి అయితే రాజధాని మార్చేస్తారా.. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా..అంటూ రెచ్చిపోయారు. ప్రజలను రోడ్డు మీదకు తెస్తారా… మా భవిష్యత్ ఏంటి అని భూమి ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తావుంటే.. మీకు అర్థం కాలేదా.. మీకు ఏ భాషలో చెప్పాలి.. రాష్ట్రంలో ఉన్న అన్ని అసోషియేషన్లు చెబుతుంటే వినరా.. అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు..
ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ రాజధాని రైతులపై తప్పుడు ప్రచారాలు చేస్తారా.. బాధితులను రెచ్చగొడతారా.. గాయంపై కారం చల్లుతారా.. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు బయటకు వచ్చారు. ఇందుకు సీఎం సిగ్గుపడాలి.. జగన్ ఇంటి నుంచి బయటకు రావాలంటే.. ఆక్టోపస్ ను తెచ్చుకుని వెళ్లాడు.. ముందు ట్రయల్స్ వేసుకుని అప్పుడు బయటకు వచ్చాడు అన్నారు చంద్రబాబు.. పరమ ఆవేశంగా..