జగన్ ప్రతిపాదనతో దెబ్బ తిన్నది వీళ్ళేనా ? ... అందుకనే గొడవలా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో  జరుగుతున్న ఆందోళనల వెనుక చాలా కొద్ది మంది హస్తం ఉందని సమాచారం.  జగన్ ప్రతిపాదనల విషయంలో నిజంగా ఆందోళనలు చేస్తున్న వాళ్ళల్లో అసలైన రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  మరి గడచిన పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో రైతులు లేకపోతే ఎవరున్నట్లు ?  ఎల్లోమీడియాలో ఎక్కడ చూసినా రైతులు, స్ధానికులు మంటలు మండిస్తున్నట్లు, అగ్నుగండాన్ని చేసేస్తున్నట్లు ఒకటే ఊదర గొడుతున్నారు.

ఇంతకీ వాస్తవమేమిటంటే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత రైతుల్లో మూడు రకాలుగా తయారయ్యారట. ఇందులో మూడో రకానికి చెందిన రైతులు  చేస్తున్న ఆందోళనలే ఇపుడు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అయితే విచిత్రమేమిటంటే రైతుల్లో మూడో రకం ఏమిటి ? ఏమిటంటే  మొదటి రెండు రకాల రైతులే ఒరిజినల్ రైతులట.

మొదటి రెండు రకాలంటే ఏమిటంటే అమరావతిని  రాజధానిగా ప్రకటించగానే అక్కడున్న భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ఏవో అవసరాలనో లేకపోతే భూముల ధరలు పెరిగాయి కాబట్టి అమ్ముకుందామనో అమ్మేసుకున్నారు. అంటే అప్పటి వరకూ లక్ష రూపాయలున్న ఎకరం ధర రాజధానిగా ప్రకటించగానే ఒక్కసారిగా రూ. 20 లక్షలకు పెరిగిపోయాయి. తమ కళ్ళముందే ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలకు కొందరు రైతులు అమ్మేసుకున్నారు.

ఇక రెండో రకం రైతులెవరంటే  అమరావతి రాజధానిగా శంకుస్ధాపన జరిగి పనులు ప్రారంభమైన తర్వాత భూములు అమ్ముకున్న వాళ్ళు. అంటే వీళ్ళు భూములు అమ్ముకునే సమయానికి ఉన్న బెంచ్ మార్కు ధర రూ. 20 లక్షల నుండి సుమారు రూ. 2 కోట్లకు పైగా  పెరిగిపోయాయి.  ఆకాశం అంత ఎత్తుకు పెరిగిపోయిన ధరలను ఊహించని రైతుల్లో కొందరు వెంటనే తమ భూములను అమ్మేసుకున్నారు.

ఇక మూడోరకం రైతులు ఇక్కడే రంగప్రవేశం చేశారు. పనులు మొదలైన తర్వాత అప్పటికున్న ధరలకు భారీ ఎత్తున భూములు కొనేసిన వాళ్ళు. వీళ్ళెవరంటే అచ్చంగా రియల్ ఎస్టేట్ జనాలు. రైతుల ముసుగులో మొదటి రెండు రకాల రైతుల నుండి భారీ ఎత్తున భూములు కొనేసి బాగా ధరలు వచ్చిన తర్వాత అమ్ముకుందామని అనుకున్న వాళ్ళు.

వీళ్ళలోనే టిడిపి కీలక నేతలు, చంద్రబాబునాయుడు బినామీలు, రియల్ ఎస్టేట్ సంస్ధల యాజమాన్యాలున్నాయి. వీళ్ళల్లోనే అత్యధికులు కమ్మ సామాజికవర్గం వాళ్ళున్నారు.  వీళ్ళేమిటంటే  చంద్రబాబే మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటారని బలంగా నమ్ముకున్న వాళ్ళు. అందుకనే కోట్ల రూపాయలు పెట్టి భూములను కొనుగోలు చేసి రాజధాని పనులు బాగా ఊపందుకున్నపుడు మెల్లిగా అమ్ముకుందామని అనుకున్నారు. అలాంటిది చంద్రబాబు ఓడిపోవటం,  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే  రాజధానిని తరలిస్తామని చెప్పటంతో నష్టపోయింది మూడో క్యాటగిరి వాళ్ళే.  ఇపుడు వాళ్ళే గోల చేస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: