హృదయాన్ని కలచివేస్తున్న చిత్రం.. మొన్నటి వరకు ఇండియాలోదే.. కానీ ఇప్పుడు మాత్రం.?

praveen

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మొత్తం హాట్ హాట్ వాతావరణం నెలకొంది. నిరసనకారులతో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయోనని అందరూ భయం గుప్పిట్లోనే  బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీని   వ్యతిరేకిస్తూ... భారీ ఎత్తున నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ఓ ఫోటో వైరల్ అవుతుంది.ఈ  ఫోటో అందరినీ కలిచివేసింది. ఇండియాలో నిర్బంధ కేంద్రంలో తండ్రి నీ బిడ్డను బంధించగా..  తన బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తల్లి ఈ చిత్రంలో కనిపిస్తుంది. 

 

 

 

 ఈ చిత్రం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఇండియాలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవంటూ ఏకంగా ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత కూడా సాక్ష్యం ఇదిగో అంటూ నెటిజనులు ఈ  ఫోటోని వైరల్ చేశారు. ఈ ఫోటోలో ఓవైపు తండ్రి బిడ్డని పట్టుకొని ఉండగా మరోవైపు గ్రిల్స్ మధ్యనుంచి తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది. ఇందులో కనిపిస్తున్న తల్లి బంగ్లాదేశ్ కు  చెందిన ముస్లిం మహిళ అని..తండ్రి  హిందువు  కావడంతో పౌరసత్వ సవరణ చట్టం ఇద్దరిని ఇలా వేరు చేసింది అంటూ ఓ స్టోరీ నెట్టింట్లో ప్రచారమైంది. అయితే ఎట్టకేలకు ఈ ఫోటోపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. 

 

 

 

 ఈ ఫోటో ఇండియా లోది కాదని తేలిపోయింది. చిత్రం అర్జెంటీనాకు చెందినది అని స్పష్టమైంది . దాదాపు ఆరు సంవత్సరాల క్రితమే 2013 సంవత్సరంలో ఇంటర్నెట్ లో ఈ ఫోటోను అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు తీసిన చిత్రమో  తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెగ వైరల్ అయిపోయింది . ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్న  విషయం తెలిసిందే. అంతే కాకుండా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఇక విపక్ష పార్టీలు అధికార బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: