ఇక నుండీ అక్కడ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం నిషేధం.. ఎందుకంటే..?

praveen

భారత నేవి దళం  లోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా భారత్ కు రక్షణ కల్పిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత నేవీలో హనీ ట్రాప్  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హని ట్రాప్ ద్వారా నేవి సిబ్బందిని ట్రాప్ చేసి నేవీ రహస్యాలన్నీ పాకిస్తాన్ తెలుసుకున్నట్లు తాజాగా వెళ్లడవడంతో ఆరుగురు సిబ్బంది అరెస్ట్ అయిన విషయం దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. దీనిపై దేశ ప్రజలు సైతం తీవ్ర స్థాయి లో పాకిస్తాన్ పై విమర్శలు చేశారు. తమ దేశ రహస్యాలను తెలుసుకోవటానికి ఇంత నీచంగా ఆలోచిస్తారా  అంటూ దేశ ప్రజలు సైతం ఈ హనీ ట్రాప్ పై  మండిపడ్డారు. పాకిస్తాన్ అమ్మాయిలను వల్ల చూపి నేవి  సిబ్బందిని ఆకర్షించి తద్వారా ఇండియన్ నేవి  రహస్యాలను తెలుసుకోవడమే ఈ హాని ట్రాప్ ముఖ్య ఉద్దేశం. 

 

 

 అయితే ఈ ఘటన తర్వాత ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం తీసుకుంది. నావికాదళ ప్రాంతాల్లో  సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లను  నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇండియన్ నేవీ. ఇప్పటికే హనీ ట్రాప్ ఉచ్చులో పడి నేవి రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న  ఏడుగురు సిబ్బందిని ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే నావికాదళ  ప్రాంతాల్లో  సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని  నిషేధించాలని నిర్ణయించింది ఇండియన్ నేవీ. ఈ మేరకు ఇండియన్ నేవీ సిబ్బంది ఎవరు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు  వాడకూడదు అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

 

 

 నేవీలో సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల  వాడుతుండటం వల్ల నావికా దళంలో పనిచేస్తున్న సిబ్బంది పై సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిలు వల విసురుతున్నారు . దీని ద్వారా ఇండియన్ నేవీ రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే హవాలా రాకెట్ ఆపరేటర్ తో పాటు మరో ఏడుగురు నేవీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నేవీ ఉద్యోగులపై నావికాదళం సోషల్ మీడియాను స్మార్ట్ ఫోన్లను  నావికాదళ ప్రాంతాల్లో  నిషేధిస్తున్నట్లు ఆంక్షలు విధించింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి నేవీ సిబ్బంది ఎవరైనా సోషల్ మీడియా వాడకం స్మార్ట్ ఫోన్ల వాడకం చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల నేవి రహస్యాలు బయటకు వెళ్లకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: