డిసెంబర్ 31 పై అది ప్రభావం చూపేనా..?
మామూలు సమయాల్లోనే తెలుగు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి వచ్చే ముఖ్య ఆదాయం మద్యం అమ్మకాలు నుంచి వస్తుంది. అందుకే మద్యం అమ్మకాలు కూడా భారీ రేంజ్ లోనే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలంగాణలో ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం మద్యం అమ్మకాలు అంతంత మాత్రంగానే జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం గా మార్చేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రజలు ఎవరు మద్యం బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.
ఇకపోతే మద్యం షాపులు అన్నింటిని మూసి వేయించి ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది. ఇప్పటికే సామాన్య ప్రజలు మద్యాన్ని కొనుక్కునేందుకు వీలు లేకుండా మద్యం ధరలు భారీగా పెంచింది ప్రభుత్వం. అంతేకాకుండా మద్యం షాపులు పని వేళలు కూడా కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది జగన్ సర్కార్.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మద్యం నిషేధాన్ని చేస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గి పోతుంది అని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇకపోతే పండగ వేళ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోతాయని విషయం తెలిసిందే.
డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు భారీగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మద్యం పాలసీ ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మద్యం పాలసీ ద్వారా మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండకుండా భారీగా మద్యం ధరలు పెంచేసి మద్యం షాపులు సమయం కూడా రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్ణయించింది జగన్ సర్కారు. అయితే రాత్రి 8 గంటలకి మద్యం షాపులన్ని మూసివేసి ఉండడంతో... ఈ ప్రభావం డిసెంబర్ 31 అమ్మకాల పై పడనుంది . గతవారం రోజుకు 70 కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి... డిసెంబర్ 31న అంటే నేడు మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు.