అతడితో సెక్స్ మానలేక.. కూతుర్నిచ్చి పెళ్లి చేసి.. ఇంట్లోనే దుకాణం పెట్టేసింది..!

Chakravarthi Kalyan
కామాతురాణాం.. నభయం న లజ్జ.. అంటారు.. అంటే కామం కోసం ఎంతకైనా తెగిస్తారు అని.. శృంగారం కోసం బంధాలు, వరుసలు ఏమీ పట్టించుకోరు కొందరు. ఓ గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ.. ఓ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడితో ఆ సెక్స్ బంధం మానలేకపోయింది. అతడు దూరం కావడం తట్టుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా అతడితో సెక్స్ కొనసాగించడం కోసం కూతురినిచ్చి పెళ్లి చేసింది.

వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కథ.. గుంటూరు జిల్లాలో జరిగింది. చివరకు ఓ ప్రాణం బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకరశర్మతో పరిచయం ఏర్పడింది. అతడు గుంటూరులో చదువుకునే రోజుల్లో అక్కడ ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.

రంకు దాగదు కదా.. విషయం తెలిసిన శర్మ కుటుంబ సభ్యులు అతనికి వేరే యువతితో వివాహం చేశారు. అయితే శర్మతో అక్రమ సంబంధం మానలేని ఆ మహిళ.. తమ సంబంధానికి ఆమె అడ్డుగా నిలుస్తోందంటూ వారిద్దరికీ విడాకులు ఇప్పించింది. ఇక అతడు మళ్లీ పెళ్లి చేసుకుని తనకు దూరమవుతాడని భావించి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏకంగా తన కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేస్తే.. అక్రమ సంబంధానికి అడ్డు ఉండదని భావించి అలాగే చేసింది.

అయితే.. తల్లికీ, తన భర్తకు ఉన్న అక్రమ సంబంధం క్రమంగా ఆ మహిళ కూతురుకు తెలిసింది. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చివరకు ఈ కుటుంబ తగాదాలు తట్టుకోలేక శర్మ ప్రకాశం జిల్లా కురిచేడు రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శర్మ జేబులో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. అక్రమ సంబంధాలు ఎంతకు తెగించేలా చేస్తాయో ఈ సంఘటన మరోసారి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: