హెరాల్డ్ 2019 సింహావలోకనంః జనసేన టాప్ 3 తికమకలివే
ఆయన మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఎన్నికలకు ముందు వరకు పవన్ ఏమీ తేల్చుకోలేకపోయారు. చివరకు సొంతంగా పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. చివరకు పార్టీ ఒక్క రాజోలు సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది.. అది కూడా ఆ ఎమ్మెల్యే పవన్ మాట వినడం లేదు కాబట్టి. రెండవసారి ఏదైనా అంశం ఎత్తుకుని ఆవేశంగా జనాల్లోకి వచ్చి మాట్లాడతారు. తర్వాత దాని గురించి మర్చిపోతారు ఆ విషయం పై పెద్దగా తిరిగి ప్రక్షాళన చేయరు. కాసేపు సినిమాలు అంటారు మరి కాసేపు రాజకీయాలు అంటారు నిలకడ లేని స్వభావంతో కొంత తికమకనేది కామన్‌గా ఏర్పడింది. రెండు పడవల మీద కాలు పెడతారు అలాఅని ఏదీ క్లారిటీగా చేయడంలేదు. ఇటు సినిమాలా లేదంటే రాజకీయాలా అన్నది సరిగా తేల్చుకోలేక తికమకపడుతున్నారనే చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా బాబులా కలిసిపోయాడని అందరూ భావిస్తున్నారు. ఆయన బాబుకి బినామీలా తయ్యారయ్యాడని. ఆయన ఏం చెపితే అదే మాట్లాడుతున్నాడని అలాంటి వాదనలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. యూటర్న్ బీజేపీ గొప్పది. అమిత్ షా గ్రేట్ అంటాడు.. ఎన్నికలకు ముందు ఎవరిని తిట్టాడో మళ్లీ అదే బీజేపీకి దగ్గరయ్యే ప్లాన్ చేశాడు.