ప్రజలదే తప్పా ? తొక్కలోది ఏం చెప్పవయ్యా బాబు
ఒక్కోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడుతారో ఆయన కే తెలియదు. అసలు తెలిసి మాట్లాడుతున్నారా ? తెలియక మాట్లాడుతున్నారా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వచ్చేలా ఆయన వ్యవహరిస్తుంటారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా తనకు ఏది మంచో ఏది చెడో తెలియదా ? మీరు చెప్పాలా అంటూ అకస్మాత్తుగా రెచ్చిపోతుంటారు. వయసు మీద పడటంతో బాబు ఇలా అప్పుడప్పుడు తిక్క తిక్కగా మాట్లాడుతుంటారు అంటూ ఆ పార్టీ నేతలే జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండడం, తన రాజకీయ అనుభవమంతా వయస్సు ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం, తాను చేయలేని, అసాధ్యం అని అనుకున్న అన్ని పనులను జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఇవన్నీ బాబు లో ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి.
తాజాగా ప్రజలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. తాను వద్దని చెప్పినా వినకుండా జగన్ కు ఓట్లేసి నెత్తి మీదకు తెచ్చి పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఒక్కసారి అంటూ కరెంటు తీగ ముట్టుకున్నారు అంటూ చంద్రబాబు ప్రజలపై తనకున్న ఆగ్రహాన్ని బయటకి వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో రాజధానిని తరలించ వద్దు అంటూ రైతులు చేపడుతున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన తరువాత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే తప్పు ప్రజలదే ఎక్కువగా ఉందని అర్థమవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజా వేదిక ను కూల్చేస్తే మనకెందుకులే అని అంతా అనుకున్నారని, ఆ తరువాత తన ఇంటిని ముంచాలని చూస్తే అది చంద్రబాబు గొడవ అని అనుకున్నారని ఇప్పుడు రాజధాని మీదకు వచ్చిన తర్వాత అందరికీ ఈ విషయం బాగా అర్థమైంది అంటూ వెటకారంగా నవ్వుతూ చంద్రబాబు ప్రజలను వెక్కిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడగగానే ఓటు వేశారని, ఇప్పుడు జగన్ వారందరి నెత్తి మీద చేయి పెట్టారంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. ఇలా వైసీపీపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలపై చూపిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోవడం వారి ఖర్మ అన్నట్టుగా విమర్శిస్తూ మానసిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు చజంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోకుండా, కేవలం పార్టీ నాయకులు బాగోగులు కోసమే చంద్రబాబు ప్రయత్నించారని, గ్రాఫిక్స్ లో రాజధాని బొమ్మలు, వీడియోలు చూపిస్తూ హడావుడి చేసి వర్షానికి కారిపోయే బిల్డింగులు కట్టారంటూ జనాలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.