మంత్రి పువ్వాడ అజయ్ కి ఘోర అవమానం.. అది కూడా కేసిఆర్ సమక్షంలోనే..?

praveen

ఈరోజు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. కాగా  నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ ను మంత్రులు. ఎమ్మెల్యేలు అందరు  సమన్వయంతో ముందుకు నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధించాలని... లేనిపక్షంలో మంత్రులు ఎమ్మెల్యేల పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. 

 

 

 ఇదిలా ఉండగా... టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వెళ్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. అదికూడా సాక్షాత్తు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నే  చేదు అనుభవం ఎదురు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యేందుకు లోపలికి వెళ్తున్న సమయంలో మంత్రి  పువ్వాడ అజయ్ ను ఆపి  పోలీసులు తనిఖీ చేశారు. పోలీసు కతీరుతో  రవాణా శాఖ మంత్రి కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. 

 

 

 మంత్రిని అని కూడా చూడకుండా నన్ను తనిఖీ చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తాను అంటు  పోలీసులను  హెచ్చరించారు. ఇకపోతే టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో టిఆర్ఎస్ నేతలందరికీ దిశానిర్దేశం చేసారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా ఒక్క మున్సిపాలిటీ ఓడిపోయిన ఒక్క కార్పొరేషన్ ఓడిపోయిన మంత్రి పదవులు పోతాయి అంటూ  హెచ్చరికలు కూడా జారీ చేస్తాడు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రెబల్స్ బెడద ఎక్కువగా లేకుండా చూసుకోవాలని సూచనలు చేశాడు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ అలెర్ట్  అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: