ఈ త‌రం యువ‌త‌: న‌చ్చింది చేసేయ్ బాస్‌... త‌ప్పో.. ఒప్పో ఐ డోన్ట్‌కేర్‌..!

KSK

ప్రస్తుతం ఉన్న యువత ఆలోచన చాలా విభిన్నంగా గతంలో ఉన్న యువతరం కంటే చాలా దారుణంగా ఉంది. చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా మనస్తాపం చెందడం విలువ ఇవ్వాల్సిన వాటికి విలువ ఇవ్వకుండా విలువ లేని వాటికోసం జీవితాలను నాశనం చేసుకుంటూ కనీసం మర్యాద కూడా లేకుండా కష్టపడే తత్వం కూడా లేకుండా టెక్నాలజీ మాయలో పడిపోయి ఏ విషయాలు ఎవరికి చెప్పుకోవాలి అన్న దాని విషయంలో కూడా కనీసం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ తమకి నచ్చింది చేసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా అనుకున్నది చేయడమే పనిగా పెట్టుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే పని మంచా చెడా ? అనే ధోర‌ణి లేకుండా ఏది తోచితే అది ఏది నచ్చితే అది ఏం చేయాలనుకుంటే అది ఆ సమయానికి చేసేయటం ఇది ప్రస్తుతం యువతరం ఫాలో అవుతున్న ట్రెండ్.

 

పెద్దవాళ్ళను గౌరవించడం విషయంలోనూ మరియు సమాజంలో ఏ విధంగా ఎలా ప్రవర్తించాలో అన్న దాని విషయంలో ఏమాత్రం ఆలోచన లేకుండా చాలా దూకుడుగా దురుసుగా ప్రస్తుత యువతరం ప్రవర్తిస్తున్నారు. జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలలో పెద్ద వారి యొక్క సలహాలు తీసుకోకుండానే తమకి తాము సొంతంగా సలహాలు తీసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న యువతరం యొక్క ఆలోచనా ధోరణి చాలా దూకుడుగా దురుసుగా ఎవరినీ లెక్క చేయకుండా ఏది మనసు చెబితే అది చేయడం అది త‌ప్పో.. ఒప్పో అనేది లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారని చాలామంది పెద్దలు ప్రస్తుతం యువతరం యొక్క ఆలోచనలను బట్టి వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఈ విధంగానే చాలా మంది యువతీ యువకులు తమ జీవితాలలో పెద్దల ప్రమేయం లేకుండా జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన విషయాలను తమకు తోచినట్టు చేసుకుంటూ పోతూ తమ జీవితాన్ని నానా విధాలుగా నాశనం చేసుకుంటున్నారని పెద్దలు యువతరం యొక్క ఆలోచనలను బట్టి కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: