ప్రపంచం ఎటు పోతున్నది.. ఈ దారుణాలకు బాధ్యులు ఎవరూ?

Balachander

మనిషి ఆదిమానవుడిగా ఉన్న సమయంలో కేవలం ఆహారం కోసమే కొట్టుకునేవారు.  ఆహారం దొరికితే దానికోసమే ఫైట్ చేసేవారు తప్పించి మరొకటి వాళ్లకు తెలియదు.  ఎక్కడ ఎలా ఉండేవారో వాళ్ళు పెద్దగా ఊహించలేదు.  భవిష్యత్ ఇలా మారిపోతుందని వాళ్ళు ముందుగానే ఊహించి ఉంటె ఇలా ప్రపంచవ్యాప్తగా విస్తరించేవారు కాదేమో.  కానీ, ఇప్పుడు జరిగింది వేరు.  జరుగుతున్నది వేరు.  ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరూ ఎవర్ని ప్రశ్నించేందుకు సమయం లేదు.  


ఇకపోతే, ఇది 21 వ శతాబ్దం.  2020 వ సంవత్సరంలో ఉన్నాం.  ఈ ఏడాది భయానకమైన విషయాలు జరుగుతాయని అంటున్నారు.  ఆ విషయాలు ఏంటి ఎలా జరుగుతాయి.  ఎందుకు జరుగుతాయి... అలా జరగడం వెనుక కారణం ఏంటి అనే వాటిని గురించి విశ్లేషించుకుంటే బాప్ రే ఇలా జరుగుతుందా... అనే భయం వేస్తుంది.  ఇలా జరగడానికి కారణం ఏంటి అనే భయం కూడా పట్టుకుంటుంది.  


ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఏంటి అంటే చమురు.  దీని మీద ఆధారపడి ప్రతి విషయం నడుస్తుంది.  చమురు నుంచి అనేక ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుంటాయి.  ముడి చమురు నుంచి పెట్రోల్ ఇంకా ఇతర ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుంటాయి.  ఈ ఉత్పత్తులు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  వీటి వలన అనేక లాభాలు వస్తుంటాయి.  అందుకే చమురు నిక్షేపాలు ఎక్కువగా దొరికే ప్రాంతంలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.  చమురు నిక్షేపాలు అధికంగా దొరికే వాటిపై అభివృద్ధి చెందిన దేశాలు కన్నేస్తాయి.

 
బలమైన దేశాలు వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి.  అలా ప్రయత్నం చేసే వాటిల్లో అమెరికా కూడా ఒకటి.  అమెరికాలో అంతటి సంపద ఉన్నది అంటే దానికి కారణం వివిధ దేశాలపై పెత్తనం చేయడంతో పాటుగా దాని దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని అమ్మకాలు జరపడం ద్వారా ఈ ఆదాయం పొందుతున్నది.  గల్ఫ్ దేశాల్లో నిత్యం ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి.  దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండవు.  అలానే ప్రాంతాల మధ్య వైషమ్యాలు, దేశంలోని పౌరుల మధ్య గొడవలు... వీటిని అడ్డం పెట్టుకొని అమెరికా వంటి దేశాలు ఆయుధాలు అమ్ముతూ లాభాలు గడుస్తున్నాయి.  గల్ఫ్ లో ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.  వీటన్నింటికి బాధ్యులు ఎవరూ అంటే ఏమని చెప్తాం చెప్పండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: