బిగ్ బ్రేకింగ్ :  జగన్ ని కలవనున్న కేజ్రీవాల్ ?

KSK

 

డిల్లీ లో ఎన్నికల నాగారా మొగెసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డిల్లీ అసంబ్లీ ఎలక్షన్ అన్నీ పార్టీలనీ బరిలోకి దింపుతోంది. ఫిబ్రవరి 8 న పోలింగ్ ఉంటుంది అనీ ఫిబ్రవరి 11 న ఫలితాలు ఉంటాయి అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

 

ఎన్నికల నోటిఫికేషన్ 14వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు వేసేందుకు 21 చివరి తేదీ. ఎన్నికల ప్రకటన రావడంతో దిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలలో 1,46,92,136 ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. డిల్లీ లో దాదాపు 70 అసంబ్లీ స్థానాలు ఉన్నాయి, 13750 పోలింగ్ బూతులలో ఓటింగ్ జరగబోతుంది. చివరి సారిగా 2015లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.అప్పట్లో ఆమ్  ఆద్మీ పార్టీ ఇక్కడ ఏకంగా 67 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది.

 

 

మోడి వ్యతిరేక శక్తి గా డిల్లీ నడిబొడ్డు లో జండా ఎగరువేసిన కేజ్రీవాల్ ఈ సారి ఎలా ముందుకు వెళతారు అనేది ప్రశ్నార్థకం గా మారింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న కేజ్రీ త్వరలోనే మోడి వ్యతిరేక పార్టీలు అందరినీ కలవబోతున్నారు. మోడి కి తాను భారీ ప్రత్యామ్న్యాయమ్ అని నిరూపించుకోవడం కోసం కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా మోడి కి ఎదురు నిలిచే సత్తా ఉన్న ప్రతీ లీడర్ నీ , ముఖ్యమంత్రి నీ , ప్రతిపక్ష నేతనీ కలవబోతున్నారు. అందులో భాగంగా నేషనల్ లెవెల్ లో , నేషనల్ మీడియా లో మంచి పేరు ఉన్న ఏపీ cm జగన్ మోహన్ రెడ్డి ని కూడా కలిసే ఆలోచనలో ఉన్నారు అనీ ,ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి తో భేటీ కి రంగం సిధ్దం అవుతోంది అని సమాచారం.

 

రానున్న రోజుల్లో తమ లీడర్ డిల్లీ స్థాయి లో చక్రం తిప్పుతాడు అని వైకాపా శ్రేణులు ఇప్పటికే సంతోషపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: