జనవరి 9: జగన్ రాజకీయ చరిత్రలో మరచిపోలేని రోజు..? ఎందుకో..?

Chakravarthi Kalyan
జనవరి 9.. ఈ తేదీకి జగన్ రాజకీయ జీవితంలో ఓ ప్రత్యేకత ఉంది. అదే జగన్ ను అధికార పీఠానికి దగ్గర చేసింది. ప్రజల గుండెల్లో గూడు కట్టుకునేలా చేసింది. ఇంతకీ ఈ జనవరి 9కు ఉన్న ప్రత్యేకత ఏంటి.. అంటారా.. అదే జగన్ పాదయాత్ర పూర్తి చేసుకున్న రోజు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి లక్ష్యాన్ని పూర్తి చేసిన రోజు ఇది.

2017లో ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్పయాత్ర ఇచ్ఛాపురంలో 09–01–2019న ముగిసింది. సుమారు 14 నెలల పాటు సాగిన పాదయాత్రలో వైయస్‌ జగన్‌ కోట్లాది మంది ప్రజలను కలుసుకొని వారి బాధలను, కష్టాలను కళ్లారా చూశారు. నేను ఉన్నాను.. నాన్నలా అండగా ఉంటాను. నేను విన్నాను.. మీ కష్టాలన్నీ కడతేర్చుతాను.. రాజన్న సుపరిపాలన తీసుకువస్తానని ప్రజలందరి గుండెల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యాత్రను ఆపలేదు జగన్. ఎముకలు కొరికే చలిలో.. భగభగ మండే ఎండల్లో.. తడిసి ముద్దయ్యే చినుకుల్లో కూడా నడక ఆగలేదు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద వెక్కించే మాటలు తూలినా.. దేహంలో కత్తిపోటు దిగినా.. పాద యాత్రికుడి గుండెల్లో ధైర్యం కాసింతైనా తగ్గలేదు. ప్రజల కోసం, వారి బతుకులను మార్చడం కోసం కష్టాలు వింటూనే 3648 కిలోమీటర్లు ఇచ్ఛాపురం వరకు నడిచాడు. 2017 నవంబర్‌ 6న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు.

ఈ యాత్ర 13 జిల్లాల్లో 341 రోజులు పాటు సాగిన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో 2516 గ్రామాల్లో 124 బహిరంగ సభలతో పాటు 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్మించారు. పాదయాత్రలో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. వారి బాధలను విన్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే జీవితాల్లో వెలుగులు తీసుకువస్తానని మాటిచ్చాడు. ప్రజల దీవెన, దేవుడి ఆశీర్వాదంతో 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించారు.. వైయస్‌ జగన్‌. అందుకే ఈ జనవరి 9 ఆయన జీవితంలో చిరస్మరణీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: