రాములమ్మ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?

NAGARJUNA NAKKA

రాములమ్మ ఇక రాజకీయాలకు దూరమయ్యారా..? ఇక పై పూర్తి సమయం సినిమాలకే కేటాయించబోతున్నారా..? ఎన్నికలు ముగిసిన తరువాత...ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కోర్ కమిటీ సమావేశానికి ఆహ్వానం లేదంటూ రాములమ్మ చెప్పినా... రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 

విజయశాంతి... ఇప్పటి వరకు రాజకీయ నాయకురాలు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చేశారు. మహేష్ బాబుతో సినిమాలో నటించటంతో...షూటింగ్ బిజీలో ఉండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తవ్వటంతో.. మళ్లీ రాజకీయాల పై రాములమ్మ దృష్టి సారిస్తారా..? లేదంటే సినిమాకే పరిమితం అవుతారా?  అనే చర్చ మొదలైంది. విజయశాంతి.. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు కూడా రాజకీయంగా యాక్టీవ్ గానే ఉంటూ వచ్చారు. కానీ సినిమాలో అవెకాశం వచ్చిన తరువాత...రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీలో మెంబర్ గా పనిచేసిన రాములమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో... రాములమ్మ కూడా రాజీకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు రావటంతో ఎఐసీసీ..పార్లమెంట్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత... కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కలేదు విజయశాంతి.

 

విజయశాంతి.. పార్లమెంట్ ఎన్నికల తరువాత జరిగిన కోర్ కమిటీ సమావేశాలకు ఆహ్వానం లేదని అలక వహించారు. అయితే  కోర్ కమిటీ సమావేశానికి అందరికి ఆహ్వానం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మిగిలిన సమావేశాలకు అయినా విజయశాంతి హాజరవ్వాలి కదా..? అనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఎన్నికల తరువాత పీసీసీ చీఫ్ మార్పు గనక ఉంటే.. నేను కూడా రేసులో ఉన్నా...అవకాశం ఇవ్వండి అధికారంలోకి తీసుకువస్తా.. అనే రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ తరువాత విజయశాంతి... పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పార్టీలో కొంత మంది వ్యతిరేకులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. చాలా రోజుల తరువాత సినిమా లో నటించిన విజయశాంతి....ఇక సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతారనే చర్చ కూడా ఉంది. విజయశాంతి రాజకీయంగా అంత యాక్టీవ్ గా మాత్రం లేరు. ఎన్నికల సమయంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభలకు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్పిపల్ ఎన్నికలు మాత్రమే ఉన్నారు. కానీ విజయశాంతికి పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందా.. వస్తే ప్రచారానికి వస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం విజయశాంతి...సరిలేరు మీకెవ్వరు సినిమా జోష్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. 

 

రాజకీయాల్లో బిజీగా లేనప్పుడు సినిమా...సినిమాలు అయిపోగానే రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ఏమో కానీ... చాలా కాలంగా మాత్రం యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. రాములమ్మ... మనసులో ఏముందో కానీ... రాజకీయాలకు దూరమవుతారనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: