ట్రంప్ తల నరికితే... 575 కోట్లు.....

Kumar Vinod

తమ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు ఎలా అయినా సరే అగ్ర రాజ్యం అమెరికా మీద పగ తీర్చుకోవాలని భావిస్తుంది. ఇరాన్ అన్నంత పని చేసింది. గత శుక్రవారం డ్రోన్ దాడిలో ఖాసీం ని అమెరికా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.. దీనిపై ఇరాన్ అమెరికా మీద కక్ష సాధింపు చర్యలకు దిగాలని భావిస్తుంది. సోమవారం ఇరాక్ రాజధాని టెహ్రాన్ లో, సోమవారం ఇరాక్ రాజధాని టెహ్రాన్ లో, ఇరాక్‌ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది.  ఇరాక్‌ లోని అమెరికా వైమానిక స్థావరమే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. 


ఇరాక్‌ లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌ బేస్‌ లపై డజనుకుపైగా క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇరాక్‌ లోని అమెరికా, సంకీర్ణ దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడినట్టు అగ్రరాజ్యం రక్షణ శాఖ ప్రజా సంబంధాలు శాఖ కార్యదర్శి జొనాథన్ హాఫ్‌మన్ ఓ ప్రకటనలో తెలిపారు.


ఖాసీం అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. దీనికి భారీగా ఇరాన్ ప్రజలు, సైనికులు హాజరయ్యారు. అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడి తల నరికి తెచ్చిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది ఇరాన్. ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలపై ఏకంగా 80 మిలియన్ డాలర్లు,


మన కరెన్సీలో దాదాపు 575 కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించింది. దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరి నుంచి ఒక్కో డాలర్ వసూలు చేసి, తల తెచ్చి ఇచ్చిన వారికి అందజేస్తామని సంచలన ప్రకటన చేసింది ఇరాన్. ఇక సులైమానీ కుమార్తె కూడా అమెరికాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. యుద్ద౦ ఇక్కడితో ముగియలేదని, ముందు ముందు ఇంకా ఉందని ఆమె హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: