పవన్, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తేలిక.. జనసేన నేతలు ఇంకా : ద్వారంపూడి

praveen

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా  పవన్ కళ్యాణ్ ను  బూతులు తిడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నేతలు సహా టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ లోని ద్వారంపూడి చంద్రశేఖర్ నివాసం వద్ద వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏకంగా వైసీపీ జనసేన కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి యత్నించారు. 

 

 

 అయితే సంచలన వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడి తీవ్రంగా టిడిపి జనసేన కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. టిడిపి నేతలు కూడా ద్వారంపూడి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా బూతులు మాట్లాడటం పై టిడిపి జనసేన నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. అయితే దీనిపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్... పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుమ్మక్కయ్యారని సంగతి తెలియక... జనసేన నేతలు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్  పార్టీ స్థాపించినప్పుడు నుంచి మొన్నటి తాజా ఎన్నికల వరకు ఒక్క టిడిపి నేతను  కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయలేదని... వైసిపి అభ్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు దాడి చేశారంటూ ఆరోపించారు ద్వారంపూడి. 

 

 

 అంతేకాకుండా కాపు ఉద్యమం సాగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబంపై లాటి ఛార్జ్   జరిగితే కూడా పవన్ కళ్యాణ్ ఖండించలేదు అని ఆరోపించిన ఎమ్మెల్యే ద్వారంపూడి... జనసేన పార్టీ నుండి  సైతం ఎలాంటి స్పందన లేదు అని అన్నారు ద్వారంపూడి . టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమానికి వ్యతిరేకి కావడంతోనే ముద్రగడ పద్మనాభం కుటుంబం పై లాఠీచార్జి జరిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మౌనం వహించాడు అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే ద్వారంపూడి. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరో మారు  సంచలనంగా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: