సీబీఐ గురించి జగన్ గుండెళ్లో రైళ్లు..? ఆ లేఖ అదే చెబుతోందా..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అనుకున్నది చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అదే సమయంలో ప్రత్యర్థి టీడీపీ మూలాలపై ఆయన కొడుతున్న దెబ్బలు.. చంద్రబాబుకు షాకు మీద షాకులిస్తున్నాయి. అందుకే జగన్ ను కంట్రోల్ చేసేందుకు ఆయన తన శక్తియుక్తులన్నీ ఉపయోగించే పనిలో ఉన్నారు.

ఈ దేశంలో చంద్రబాబుకు ఉన్నంత నెట్ వర్క్ ఏ నాయకుడికీ లేదని ఓ టాక్ ఉంది. కేవలం రాజకీయ నేతలతోనే కాకుండా.. అధికారులు, కోర్టులు, రాజ్యాంగబద్ద సంస్థలు.. ఇలా అన్నిచోట్లా చంద్రబాబు మనుషులు ఉన్నారంటారు. ఇప్పుడు సీబీఐ విషయంలోనూ ఇదే జరుగుతోందా.. అన్న అనుమానం జగన్ టీమ్ లో కలుగుతున్నట్టోంది. ప్రత్యేకించి జగన్ మెడపై వేలాడుతున్న సీబీఐ కేసుల విషయంలో చంద్రబాబు ఏదైనా ప్లాన్ వేయవచ్చని అనుమానిస్తోంది.

హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేని అధికారిని నియమించాలని కోరుతూ ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖ చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి తన లేఖలో ఏం రాశారంటే..

“ ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ, చంద్రబాబునాయుడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు.

ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మీ నారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైయ‌స్ జగన్‌కు ఇబ్బందులు సృష్టించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగింది. లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారనివిజయసాయి రెడ్డి తన లేఖలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: