బాలకృష్ణను ఇలా ఎప్పుడు చూసుండరు..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడైన నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకమైన క్రేజ్  ఉంటుందన్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ హీరోయిజానికి మారుపేరు నందమూరి బాలకృష్ణ. విలన్లను ఊచ  కోత కోయాలి అన్న పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే  సొంతం అని చెప్పాలి. ఇక బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ హీరోయిజం పక్క అని ప్రేక్షకులు నమ్ముతుంటారు. ఇక బాలయ్య డైలాగ్ చెప్తుంటే థియేటర్లో  సినిమా చూస్తుంటే  ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలతో  రెచ్చిపోతుంటారు. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ బాలయ్య పంచ్ డైలాగులు చెబుతుంటే... అబ్బో నందమూరి అభిమానులు అందరూ తెగ సంబర పడిపోతున్నారు. 

 

 

 హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా అదే క్రేజ్  దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మొన్నటికి మొన్న కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్  సినిమాలలో  నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో సరికొత్త లుక్తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. యువ హీరోలకు సైతం పోటీనిచ్చేలా బాలకృష్ణ సరికొత్త లుక్ అదరగొట్టింది. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే కలెక్షన్లు బాగానే రాబట్టినప్పటికీ సినిమా టాక్ నెగిటివ్ గానే వచ్చింది. 

 

 

 ఇక పోతే ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ నందమూరి బాలకృష్ణ ముందుకు సాగుతున్నారు. నందమూరి బాలకృష్ణ తాజా లుక్ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్న బాలయ్య గుండు చేయించుకుని ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ అసలు సిసలైన పొలిటికల్ లుక్ తో  బాలయ్య కనిపిస్తున్న ఈ ఫోటోలు నందమూరి అభిమానులను ఆకర్షిస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానులు అందరూ భారీగా లైకులు షేర్లు చేస్తున్నారు. బాలకృష్ణ ఏదైనా ముక్కు తీర్చుకున్నారా లేదా సినిమా కోసం ఇలాంటి గెటప్ వేశారా  అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇలాంటి గెటప్లలో బాలకృష్ణ మునుపెన్నడూ అభిమానులు చూస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: