మేడారం వెళ్లే భక్తులకు.. తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్..?
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పై పోరు సలిపి ప్రాణాలర్పించిన వీరవనిత లైన సమ్మక్క సారలమ్మలను గిరిజనులు స్మరించుకుంటూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుకుంటూ ఉంటారు. ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. ఇక ఎలాంటి విగ్రహాలు లేకుండా కొలిచే దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అమ్మ వార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర... కుంభమేళ తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతరగ దేశంలోనే ప్రసిద్ధి కెక్కింది.
ఇక సమ్మక్క సారలమ్మల జాతర మొదలైంది అంటే తెలుగు రాష్ట్రాల నుంచి సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలి వెళ్ళేందుకు రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. భారీ మొత్తంలో తెలుగు రాష్ట్రాల నుంచి సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రజలు తరలి వెళ్తారు కాబట్టి... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కువ మొత్తంలో బస్సు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు. ఇకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో సమ్మక్క సారలమ్మల జాతర జరగనుంది. జాతర కోసం ఇప్పటి నుంచే సమ్మక్క సారలమ్మ గద్దెలు వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
అయితే జాతర ఈ సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాతర సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇప్పటినుంచి భక్తులు తరలి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేడారం వెళ్లే భక్తులకు నజరానా ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి మేడారం ఉత్సవాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 1 లోపు మేడారం దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు వారి వారి ఇళ్లవద్ద కే బస్సులు పంపించనున్నట్లు నగరంలోని చెంగిచెర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వి మల్లయ్య తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలకోసం బస్సు బుకింగ్ ల కోసం.. డిపో మేనేజర్ నెంబర్ 7893088433, అసిస్టెంట్ మేనేజర్ 7382924742 నెంబర్లకు సంప్రదించవచ్చు.
అయితే మేడారం జాతరకు భారీ మొత్తంలో భక్తులు సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలి వస్తుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో పూర్తి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మేడారం జాతర సందర్భంగా ఎంతో అది సినీ రాజకీయ ప్రముఖులు సైతం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి వస్తారు.