విశాఖకు రాజధాని వద్దనేటోళ్లకు ఓట్లడిగే హక్కుందా...?
ఆంధ్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయం . రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ అవసరమని దీని కోసం కర్నూలులో హైకోర్టు విశాఖలో పరిపాలన రాజధాని అమరావతిలో చట్టసభల రాజధాని నిర్మించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. జగన్ సర్కార్ నిర్ణయం పై విశాఖ వాసులు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం ఇక పరిపాలన రాజధాని ఏర్పడితే మరింత అభివృద్ధి చెందుతుంది అని మురిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు పూర్తి మద్దతు తెలిపారు. కానీ విపక్ష పార్టీల అయిన టిడిపి బిజెపి జనసేన పార్టీ లు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటు చేయొద్దంటూ తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
అమరావతి నుంచి రాజధాని ఒక్క అడుగు కూడా కదలనివ్వం అంటూ శపథాలు చేశారు. అమరావతి మాకు రాజధానిగా కావాలని... విశాఖను రాజధానిగా చెయ్యద్దు అంటూ విపక్ష పార్టీలు అని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి . ఇక చివరి దాకా వచ్చిన బిల్లును శాసన మండలిలో కూడా అడ్డుకున్నాయి విపక్ష పార్టీలు. చివరికి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చేసాయి. అయితే రాజధాని అమరావతిలోని కొనసాగాలని విపక్ష పార్టీలు అయిన టిడిపి జనసేన బీజేపీ పార్టీలు వికేంద్రీకరణను అడ్డుకోవడం వరకు బాగానే ఉంది కానీ... విశాఖలో రాజధాని వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న విశాఖ వాసుల ఆశలను అడియాశలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ విశాఖ వాసులకు ఏం సమాధానం చెబుతారు అన్నది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రశ్న.
విశాఖను పాలన రాజధాని వద్దనే వారు.. విశాఖకు వెళ్లి మళ్లీ మాకు ఓటు వేయండి అని ఎలా అడుగుతారు... అసలు ఓటు అడిగే ఛాన్స్ ఉంటుందా.. అనే కొత్త ప్రశ్న ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో తెరమీదికి వచ్చింది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు వద్దని అన్ని అమరావతి లోనే ఉండాలని... అమరావతిని అభివృద్ధి చేయాలి అంటూ పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ.. విశాఖ వాసులకు అసలు ఏం సమాధానం చెబుతారు అన్నది ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న. విశాఖలో రాజధాని వద్దని చెప్పి పోరాటం కూడా చేశాము కానీ మీరు మాకే ఓట్లు వేయండి అని వచ్చే ఎన్నికల్లో కనీసం అడగడానికి వీలుంటుంద.. ఒకవేళ అన్నీ మర్చిపోయి నేతలు ప్రజలను ఓట్లు అడిగినప్పటికీ విశాఖ వాసులు ఎలా రియాక్ట్ అవుతారో..? .. చూడాలి మరి విపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతారో అడగరో.