జగన్ ను మిస్ లీడ్ చేసింది ఈ ముగ్గురేనా ?

Vijaya
వైసిపిలోని ముగ్గురు కీలక నేతలను నమ్మిన ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతిన్నదని పార్టీలోనే ప్రచారం మొదలైంది.  మండలిలో రెండు బిల్లులను ఆమోదించుకునే  విషయంలో అధికారపార్టీ ఎంత ఘోరంగా విఫలమయ్యిందో అందరూ చూస్తున్నదే.  పాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు అసెంబ్లీలో సునాయసంగానే పాసైనప్పటికీ మండలిలో మాత్రం ఊహించని రీతిలో దెబ్బ పడింది.

మెజారిటి కారణంగా శాసనమండలిలో  రెండు బిల్లులు ఓడిపోతాయని జగన్ కూడా ఊహించారు. అయితే  మంత్రులు బొత్సా సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి మంత్రాంగం వల్ల మండలిలో కూడా బిల్లులు ఆమోదం పొందుతాయని జగన్ అనుకున్నారట. ఎందుకలాగ అంటే వీళ్ళద్దరూ ఇతర పార్టీల ఎంఎల్సీలతో మంతనాలు జరిపారట. అంటే ఇందులో తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీలు కూడా ఉన్నారు లేండి.

తాము మొత్తం స్టేజ్ సెట్ చేశామని కాబట్టి గెలిచిపోతామని జగన్ కు వీళ్ళు ముగ్గురు నమ్మకంగా చెప్పారట. దాంతో మొత్తం భారమంతా వీళ్ళపై వదిలేసిన జగన్ హ్యాపీగా కూర్చున్నారట. అయితే బిల్లులు అసెంబ్లీ నుండి మండలికి వెళ్ళిన తర్వాత కానీ అసలు సీన్ అర్ధం కాలేదట.  రెండు బిల్లులను మంగళవారం ఉదయం నుండి బుధవారం సాయంత్రం వరకూ అసలు చర్చకే అనుమతించలేదు.

పరిస్ధితిని గమనించిన మంత్రులు, విజయసాయి వెంటనే రంగంలోకి దిగి గెలిపించకపోతే పోయే కనీసం చర్చ జరిపి ఓటింగ్ లో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని చెప్పారట. అయితే వీళ్ళెంత చెప్పినా టిడిపి సభ్యులు ఒప్పుకోకుండా అసలు చర్చనే జరగనీయకుండా అడ్డుకున్నారు. చివరకు జగన్ కూడా ఊహించని విధంగా సెలక్ట్ కమిటికి పంపుతు ఏకంగా మండలి ఛైర్మన్  ఎంఏ షరీఫ్ తోనే ప్రకటన చేయించారు. దాంతో అధికార పార్టీ పరువంతా ఒక్కసారిగా పోయింది. అందుకనే జగన్ తర్వాత వీళ్ళ ముగ్గురికి ఫుల్లు క్లాసులు పీకినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: