హెరాల్డ్ బర్త్ డే : జనవరి 27 న జన్మించిన ప్రముఖులు వీరే..?

praveen

జనవరి 27వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  ఒకసారి స్టోర్ లోకి వెళ్లి చూద్దాం రండి.

 

 విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి  జననం : ప్రముఖ వేద విద్వాంసులైన విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి 1910 జనవరి 27వ తేదీన జన్మించారు. విశ్వనాథం జగన్నాథ ఘనాపాటి  రాజమండ్రి కీర్తిని ఎంతగానో పెంచారు. నగర చరిత్ర లో అంతర్భాగంగా నిలిచిన ధన్యజీవి విశ్వనాథం జగన్నాథ ఘనాపాటి . ఆయన కంఠస్వరం ఎంతో మధురమైనది. అద్భుతమైన ఉచ్చారణ ఆయన సొంతం . విశ్వనాథ జగన్నాథ గణపాటి  నోటినుంచి వేదాలను వినడానికి అందరూ ఆసక్తి చూపేవారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా 1961 జులై రెండవ న విద్య వాచస్పతి పురస్కారం అందుకున్నారు విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి . ఇక ఆ తర్వాత ఎందరో దేశ ప్రధానులు చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు విశ్వనాథ జగన్నాధ ఘనాపాటి . ఎన్నో బిరుదులు ఎన్నో పురస్కారాలు ఎన్నో సత్కారాలు పొందారు. 

 

 పోతుకూచి సాంబశివరావు జననం : సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసి రచయితగా కవిగా ఎన్నో పురస్కారాలు అందుకున్న వ్యక్తి పోతుకూచి సాంబశివరావు. 1927 జనవరి 27వ తేదీన జన్మించారు ఈయన . తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన పోతుకూచి సాంబశివరావు తన రచనలతో ఎంతో ప్రసిద్ధి చెందారు. కథల రచయితగా నవలా రచయితగా నాటక రచయితగా ఎన్నో రచనలతో  ఎంతో ప్రసిద్ధి చెందారు ఈయన. కవిగా కూడా ఆయన సుప్రసిద్ధుడు. కళాప్రపూర్ణ లాంటి ఎన్నో పురస్కారాలని  కూడా అందుకున్నారు పోతుకూచి సాంబశివరావు. 

 

 చమిందా  వాసు  జననం : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ చమిందా వాసు  1974 జనవరి 27వ తేదీన జన్మించారు. 1994 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ గా  మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయి ఎన్నో ఏళ్ల పాటు జట్టులో కొనసాగాడు.

 

 డానియెల్ వెట్టోరి జననం : న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి.  ఇతను టెస్టు చరిత్రలో 300 వికెట్లు తీసుకున్న మరియు మూడు వేల పరుగులు సాధించిన ఎనిమిదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులోనే తొలిసారిగా టెస్ట్ క్రికెట్ న్యూజిలాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించి అతి చిన్న వయసులోనే ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు డానియెల్ వెట్టోరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: