సీఎం జగన్ సంచలన నిర్ణయం... పేదలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. ఏపీ సీఎం జగన్ నిన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష జరిపి సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు సంబంధిత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 
సీఎం జగన్ మాట్లాడుతూ ఉగాది పండుగ నాటికి రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉన్నా వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమ్మఒడి తరువాత చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇదేనని సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రజా సాధికారిక సర్వే కీలకం కాకూడదని సీఎం జగన్ చెప్పారు. 
 
అధికారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాల కొరకు ఇచ్చే స్థలాలు ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. ఉపయోగం లేని చోట స్థలాలను ఇవ్వరాదని అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రకటించారు. ఇళ్ల పట్టాల కొరకు ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపితే మాత్రమే ప్లాటింగ్ చేయాలని జగన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. లబ్ధిదారులు వారికి కేటాయించే స్థలం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేయాలని సీఎం జగన్ సూచనలు చేశారు. 
 
అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కొరకు తీసుకోవద్దని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఇళ్ల పట్టాల కొరకు అర్హులైన వారి వివరాలను ఉంచాలని సూచించారు. సచివాలయాల్లో అర్హులై ఉండి ఎంపిక కానివారు ఉంటే ధరఖాస్తు చేసుకునేలా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వారు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సూచించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం వెంటనే చూపించాలని సీఎం చెప్పారు. వారికి ఇళ్లు కట్టి అప్పగించి సంతోషపెట్టాలని సూచించారు. అధికారులు ఈ విషయంలో హడావిడిగా వ్యవహరించవద్దని సీఎం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: